IKEA News: ప్రస్తుతం ఆదాయాలు పెరుగుతున్న వేళ భారతీయ ప్రజల్లో కొనుగోలు స్వభావం పెరుగుతోంది. కన్జూమర్ మార్కెట్ గా మారటంతో ఇక్కడి ప్రజల అవసరాలను క్యాష్ చేసుకునేందుకు అనేక విదేశీ సంస్థలు తమ వ్యాపారాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
తాజాగా స్వీడన్ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా భారతదేశంలోని తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ-కామర్స్ సంస్థల మాదిరిగానే నేరుగా ఇంటి వద్దకు ఫర్నిచర్ డెలివరీ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని 62 జిల్లాలకు డోర్ డెలివరీ సేవలను విస్తరిస్తోంది.

తాజా చర్య వల్ల కంపెనీ స్టోర్లకు రాకుండానే వినియోగదారులు తమకు నచ్చిన ఫర్నిచర్, వస్తువులను ఐకియా యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. అయితే వినియోగదారులు ఆర్డర్ చేయటానికి ముందు తమ ప్రాంతానికి డెలివరీ సౌకర్యం ఉందో లేదో తెలుసుకునేందుకు వారు తమ పిన్‌కోడ్ వివరాలు ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఈ చర్య తమ వ్యాపారాన్ని కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని ఐకియా ఇండియా సీఈవో సుసాన్ పుల్వెరెర్ వెల్లడించారు.
అయితే దీనిని సాధించటానికి కంపెనీ తన సరఫరా గొలుసు(లాజిస్టిక్స్) సామర్థ్యాలను మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఐకియా 2018 ఆగస్టులో హైదరాబాదులో ఏర్పాటు చేసిన రిటైల్ స్టోర్ లక్షల మందికి సేవలను అందించింది. అలాగే ఫర్నిచర్ దిగ్గజం ముంబై, పూణే, హైదరాబాద్, గుజరాత్, బెంగళూరులో ఆన్‌లైన్ ఉనికిని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications