ఐఐటీ .... ఆ పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ పులకించిపోతారు. తమ పిల్లలకు ఎలాగైనా ఐఐటీ లో సీటు రావాలని కళలు కంటారు. ఇందుకోసం పిల్లలను హాస్టల్స్ లో ఉంచి మరీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తారు. ఒకసారి రాకపోయినా ... మరో సారి ప్రయత్నించామని పిల్లలను ప్రోత్సహిస్తారు. మరో వైపు తిరుపతి వెంకన్న దగ్గర నుంచి అన్ని రకాల దేవుళ్ళకు మొక్కులు మొక్కుకుంటారు. వారు కోరుకున్నట్లే పిల్లలకు ఐఐటీ లో సీట్ వస్తే ... ఇక వారి సంతోషానికి అవధులే ఉండవు. ప్రపంచాన్ని జయించినట్లు, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు తెగ సంబరపడిపోతారు. ఎందుకంటే... ఒకసారి ఐఐటీ లో సీట్ లభిస్తే ఇక పిల్లలకు భవిష్యత్ బంగారమే కాబట్టి.
ఏ మల్టీ నేషనల్ కంపెనీయో రూ లక్షల్లో వేతనాలు అందించి మంచి కొలువు ఇస్తుందని, విదేశాల్లో మంచి హోదాలో పిల్లలు సెటిల్ అవుతారని పేరెంట్స్ అభిలాష. అది నిజం కూడా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్న పరిస్థితుల్లోనూ ... భారత్ లోనూ మాంద్యం అలుముకున్న సందర్భంలోనూ దేశంలోని ఐఐటీ లు దూసుకు పోతున్నాయి. పేరెంట్స్ నమ్మకాన్ని నిజమని నిరూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ ఐఐటీ ఈ విషయంలో మరింత ముందు ఉండటం విశేషం. కొత్తగా ఏర్పాటు చేసినప్పటికీ హైదరాబాద్ ఐఐటీ పాత ఐఐటీ లతో పోటీ పడుతూ విద్యార్థులకు మంచి ఆఫర్లను అందించగలుగుతోంది.

హైదరాబాద్ టాప్...
దేశంలోని సుమారు 20 ఐఐటీ లో ప్రీ ప్లేసెమెంట్స్ సీజన్ నడుస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు చురుకైన విద్యార్థులను ఎంపిక చేసుకొనేందుకు ఐఐటీ లకు క్యూ కడుతున్నాయి. దాదాపు అన్ని ఐఐటీ ల్లోను ప్లేసెమెంట్స్ జోరుగా సాగుతున్నాయి. విద్యార్థులకు మెరుగైన ప్యాకేజి లతో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ ఐఐటీ ఈ విషయంలో చాలా ముందు ఉంది. గతేడాదితో పోల్చితే హైదరాబాద్ ఐఐటీ ఆఫర్ల సంఖ్య రెట్టింపు ఐంది. మాంద్యంలోనూ ఇంతటి అనూహ్య స్పందన లభించటం విశేషం. గతేడాది ఈ సీజన్లో మొత్తం ప్లేసెమెంట్ ఆఫర్లు 9 రాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 37కి పెరిగింది. ప్రీ ప్లేసెమెంట్ ఆఫర్ (పిపిఒ)గా పరిగణించే ఈ ప్లేసెమెంట్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఐటీ ప్లేసెమెంట్ ఫాకల్టీ ప్రదీప్ కుమార్ యేముల తెలిపారు. ఇక్కడ మైక్రోసాఫ్ట్, డీఈ షా అధిక వేతనాలతో ఆఫర్స్ ఇచ్చాయని చెప్పారు. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్, అమెజాన్...
ఐఐటీ ల్లో చదివే విద్యార్థులను చదువుతున్నప్పుడే గొప్ప ఆఫర్ల తో ఎగరేసుకు పోవటంలో మల్టీ నేషనల్ కంపెనీ (ఎంయెన్ సి) లదే పైచేయి. వారి టాలెంట్ ను గుర్తించి రూ లక్షల్లో వేతనాలను ఆఫర్ చేసి ముందుగానే వారిని రిజర్వు చేసుకొంటాయి ఈ కంపెనీలు. ఈ విషయంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గోల్డ్మన్ షాచ్ ముందున్నాయి. సామ్ సంగ్ ఆర్ అండ్ డి, అడోబీ, క్వాల్ కామ్, రుబ్రిక్ వంటి దిగ్గజాలు కూడా పోటీలో పాల్గొంటున్నాయి. మందగమనాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా విద్యార్థులకు మెరుగైన ప్యాకేజీలు అందిస్తూ దూసుకుపోతున్నాయి. అయితే దేశీ కంపెనీలు వీటితో పోటీ పడలేక పోయినా... అవి కూడా వాటి స్థాయిలో ఆఫర్లను అందిస్తున్నాయి.

భారీ పెరుగుదల ..
దేశంలోని దాదాపు అన్ని ఐఐటీ ల్లో ఈ ఏడాది ప్రీ ప్లేసెమెంట్ ఆఫర్లు సగటున 20% వరకు పెరిగాయి. ఐఐటీ బొంబాయ్ లో 24% పెరిగి 163 కు చేరుకొన్నాయి. గువాహటి లో 19% వృద్ధి చెంది 119 కు పెరిగాయి. ఖరగ్పూర్ ఐఐటీ లో గతేడాది సంఖ్య 261 కంటే అధికంగా ఆఫర్లు లభించాయి. ఇంకా వస్తున్నాయి. ఐఐటీ గాంధీనగర్ లో నూ 20% అధికంగా ప్రీ ప్లేసెమెంట్ ఆఫర్లు లభించాయి. అన్ని ఐఐటీ ల్లోనూ ఐటీ సాఫ్ట్ వేర్ రంగానికి సంబంధిచిన ఆఫర్లే అధికంగా ఉంటున్నాయి. ఆ తర్వాత హార్డ్ వేర్ విభాగం ఉండగా.. అనలిటిక్స్, కన్సల్టింగ్ వంటి ఆఫర్స్ ఆ తర్వాత లభిస్తున్నాయి.

నాణ్యత వల్లే...
ఐఐటీ ల్లో చదివే విద్యార్థుల నాణ్యతే వారికి అధిక అవకాశాలను కల్పిస్తుందని డెలాయిట్ చీఫ్ టాలెంట్ ఆఫీసర్ ఎస్ వీ నాథన్ వ్యాఖ్యానించారు. డెలాయిట్ కూడా పెద్ద సంఖ్యలో ఐఐటీ విద్యార్థులను నియమించుకొంటుంది. కాగా ఈ సారి కొన్ని కొత్త ఎంయెన్ సి కంపెనీలు కూడా తోలి సారి ఆఫర్లు ప్రకటించాయి. ఇందులో నోవార్టిస్, స్ప్రింక్లర్, రుబ్రిక్, తొలిచి ఇన్సస్టు, దివేర్తా, నూటాలిక్స్, ఏంటీటీ, ఫిలిప్స్, ఇన్ఫోస్ట్రీచ్, సిస్కో వంటి కంపెనీలు ఉన్నాయి. దేశీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, క్యూర్ ఫిట్, ట్రైడెంట్, జస్ట్ మనీ వంటి సంస్థలు కూడా విద్యార్థులకు మంచి ఆఫర్లు అందించాయి.
More From GoodReturns

పేదలకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్.. ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లు..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications