Stock Market: భారీ ప్రమాతంలో ఇండియన్ స్టాక్ ఇన్వెస్టర్స్.. చివరి హెచ్చరిక- కళ్లు తెరవండి..!
Market Alarm: దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులు తమ డబ్బును కుమ్మరిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎంత కాలం చేయాలి వంటి కనీస ఫండమెంటల్స్ గురించి అస్సలు ఆలోచించటం లేదు. ఈ పరిస్థితులు ప్రజలకు పెద్ద ప్రమాదాలను తెచ్చిపెట్టవచ్చు.
భారతీయ ఇన్వెస్టర్లలో ఉన్న సాధారణ అపోహ గురించి ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ పట్టాబిరామన్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్‌లీ ఫ్రీకి ఇచ్చిన పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను పెంచడం వల్ల అధిక రాబడికి హామీ ఇస్తుందనే నమ్మకాన్ని ప్రమాదకరమైన డబ్బు అపోహ పేర్కొన్నారు. ప్రజలు మార్కెట్ ర్యాలీ నిరంతరాయంగా కొనసాగుతుందని, అది ఎప్పటికీ ఆగదన్నట్లుగా వ్యవహిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి ఇది భయంకరమైన ప్రవర్తనగా పేర్కొన్నారు. బుల్ రన్ ముగిసినప్పుడు దేశీయ ఇన్వెస్టర్లు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో ఇన్వెస్ట్మెంట్లలో సమతుల్యత ఆవశ్యకతపై నొక్కి చెప్పారు.

అధిక ఈక్విటీ ఎక్స్పోజర్ ఎల్లప్పుడూ మెరుగైన రాబడిని కలిగిస్తుందనే ఊహ లోపభూయిష్టంగా ఉంటుందన్నారు. వాస్తవానికి సగటు ఇన్వెస్టర్ 50-60 శాతం ఈక్విటీ సరిపోతుందన్నారు. నష్టాలను తగ్గించుకోవటానికి ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ వైవిధ్యపరచడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. దేశీయంగా మార్కెట్ల మెగా బులిష్ ర్యాలీకి కారణం నిజానికి గృహ సంపదలో గణనీయమైన పెరుగుదలకు దారితీసిందని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రజలు ఎక్కువ రాబడిని అందిస్తున్న మ్యూచువల్ ఫండ్లకు మారటం తాను చూస్తున్నట్లు పట్టాబిరామన్ పేర్కొన్నారు. స్థిర ఆదాయ పెట్టుబడులు భద్రతా వలయాన్ని అందిస్తాయని నొక్కి చెప్పారు.
మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషకులు కూడా ఈక్విటీ పెట్టుబడులు గృహ సంపదను పెంచినప్పటికీ, ఈ పెరుగుదల గృహ రుణంలో గణనీయమైన పెరుగుదలతో సమానంగా ఉందని అన్నారు. క్యూ1 FY25లో గృహ రుణం-GDP నిష్పత్తి 42%కి పెరిగిందన్నారు. ప్రస్తుతం ఈక్విటీలు అందిస్తున్న మెగా రాబడులు భవిష్యత్తులో కొనసాగకపోవచ్చని చరిత్ర సూచిస్తోందని అన్నారు. కరోనా మహమ్మారి ప్రారంభ రోజుల్లో స్టాక్ మార్కెట్ క్షీణత గృహ ఆర్థిక సంపదలో 3% తగ్గుదలకు దారితీసిందని ఆర్బీఐ గుర్తించింది. ఇది పట్టాబిరామన్ ఆందోళనలను మరింత ధృవీకరిస్తుంది.


Click it and Unblock the Notifications