కరోనాను గుర్తించేందుకు రిస్ట్‌బాండ్? ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణ
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర కేసులు దాటాయి. ఆరున్నర లక్షల మరణాలు చోటు చేసుకున్నాయి. దేశంలో 13 లక్షలకు పైగా కేసులు, 31వేలకు పైగా మరణాలు ఉన్నాయి. సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కరోనా అందరినీ భయపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ మ్యూజ్ వేరబుల్స్ కరోనా వైరస్ లక్షణాలు గుర్తించి రిస్ట్ బాండ్ తయారీ కోసం రూ.22 కోట్లు సమీకరించింది. ఇది కరోనా ప్రారంభ దశలో ఉన్న సమయంలో గుర్తిస్తోందట.

రిస్ట్ బాండ్ వాచీ ధర రూ.3500
ఈ రిస్ట్ బాండ్ ధర రూ.3,500. వచ్చే నెల ఆగస్ట్ నాటికి ఈ రిస్ట్ బ్రాండ్ 70 దేశాల్లో కన్స్యూమర్స్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రిస్ట్ బాండ్ శరీర ఉష్ణోగ్రతను, గుండె కొట్టుకునే వేగాన్ని ట్రాక్ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ తెలియజేస్తుంది. కరోనా మహమ్మారి వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో ఉంటే వీటి ద్వారా ట్రాక్ చేయడానికి సులువు అవుతోంది. ఈ ఏడాది తాము 2 లక్షల ఉత్పత్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2022 నాటికి పది లక్షలకు పెంచాలని భావిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ అలుమ్నీ కేఎల్ఎన్ సాయి ప్రశాంత్ చెబుతున్నారు. తమ ఉత్పత్తిపై ఇన్వెస్టర్లు విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఇందుకోసం తాము రూ.22 కోట్లు సమీకరించినట్లు చెప్పారు.

స్మార్ట్ ఫోన్ కనెక్ట్
మ్యూజ్ వేరబుల్స్ తయారు చేస్తోన్న రిస్ట్ బాండ్‌ను మ్యూజ్ హెల్త్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్‌కు అనుసంధానించుకోవచ్చు. యూజర్ డేటా ఫోన్, రిమోట్ సర్వర్‌లో సేవ్ అవుతుంది. ఇందులో మరిన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ ద్వారా ఆరోగ్య సేతు యాప్ అలర్ట్స్ పొందవచ్చు. యూజర్లు ఎవరైనా కంటైన్మెంట్ జోన్ లేదా కరోనా హాట్‌స్పాట్ సెంటర్‌లోకి వెళ్తే వెంటనే గుర్తించవచ్చు.

హెచ్చరిక
శరీర ఉష్ణోగ్రతలు పరిమితికి మించి పెరిగినప్పుడు, SpO2 లెవల్స్ తగ్గినప్పుడు, కంటైన్మెంట్ జోన్‌లోకి ప్రవేశించినప్పుడు... యూజర్లు దీనిని వినియోగిస్తే అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ అలర్ట్(SoS) సౌకర్యం ఉంటుంది.


Click it and Unblock the Notifications