Campus Placements: దేశంలోని ప్రఖ్యాత సంస్థలుగా ఉన్న ఐఐటీ, ఐఐఎమ్ విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీల నుంచి యమాక్రేజ్ ఉంటుందని తెలిసిందే. ఏటా జరిగే క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లలో చాలా మంది కలలో కూడా ఊహించని ప్యాకేజీలను కొడుతుంటారు.
ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా స్టార్టప్ కంపెనీలను పెట్టేందుకు ఐఐటీ, ఐఐఎమ్ విద్యార్థులు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. ఆర్థిక, వ్యాపార సంక్షోభాలు కారణంగా కొన్నాళ్లుగా నియామకాలు స్తబ్ధుగా ఉన్నప్పటికీ మళ్లీ ఇప్పుడు పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ, టెక్నాలజీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇలాంటి బడా కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.

ప్రైవేటు కళాశాలలకు వచ్చే కంపెనీల కంటే ఐఐటీ, ఐఐఎమ్‌లలో ఎక్కువ కంపెనీలు ఇందులో పాల్గొంటుంటాయి. ఈ ఏడాది ఐఐటీ బాంబేలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 85 మంది రూ.కోటికి పైగా వేతనం పొందడం విద్యార్థుల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని నింపింది. ఐఐటీ బాంబే క్యాంపస్ ఇంటర్వ్యూలో 63 మంది విద్యార్థులకు ఓవర్సీస్ జాబ్ ఆఫర్లు 85 మంది విద్యార్థులు రూ.1 కోటి వేతనంతో జాబ్ ఆఫర్లను పొందారు. జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్‌లలో పని చేయడానికి 63 మంది ఎంపికయ్యారు.
ఈ క్రమంలో యాక్సెంచర్, ఎయిర్ బస్, ఎయిర్ ఇండియా, ఆపిల్, డెలాయిట్, బజాజ్, బార్ల్కేస్, డీహెచ్ఎల్, ఫుల్ట్రాన్, ఫ్య్యూచర్ బస్ట్, గూగుల్ సహా మరిన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాయి. 388 దేశీయ ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ కంపెనీలు 2023-24 కోసం ప్రారంభ నియామకాల్లో పాల్గొన్నాయి. కంపెనీలు నేరుగా విద్యార్థులతో సమావేశమై ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. డిసెంబర్ 20, 2023 వరకు 1,340 ఉద్యోగ ఆఫర్‌లు ఇవ్వగా.. వాటిలో 1,188 మంది విద్యార్థులకు ఉపాధి లభించింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications