సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్భణం 7.34 శాతానికి పెరిగింది. ఇది ఎనిమిది నెలల గరిష్టం. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణం. రిటైల్ ద్రవ్యోల్భణాన్ని వినియోగ ధరల ఆధారిత సూచీ ప్రకారం లెక్కిస్తారు. ఆగస్ట్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 6.69 శాతంగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో 3.99 శాతంగా నమోదయింది. గత ఏడాది అక్టోబర్ నుండి రిటైల్ ద్రవ్యోల్భణం 4 శాతానికి పైగా ఉంటోంది. 2020 జనవరిలో ఏకంగా 7.59 శాతానికి పెరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్లో గరిష్ట రిటైల్ ద్రవ్యోల్భణం నమోదయింది.
ఆగస్ట్ నెలలో 9.05 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 10.68 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 20.73 శాతం పెరిగాయి. ప్రొటీన్ రిచ్ గూడ్ల ధరలు 15.47 శాతం పెరిగాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ద్రవ్యోల్భణం 2.87 శాతంగా ఉంది.

తయారీ, గనులు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి క్షీణత మొత్తం పారిశ్రామికోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగాల్లో ఉత్పత్తి క్షీణించడంతో పారిశ్రామికోత్పత్తి 8 శాతం తగ్గింది. పారిశ్రామికోత్పత్తి ఆగస్ట్ నెలలో 1.4 శాతం క్షీణతను నమోదు చేసింది. అయితే కరోనా నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల సమయంలో నమోదైన గణాంకాలతో ఏడాది క్రితం గణాంకాలను పోల్చడం సరికాదని గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. తయారీ రంగం 8.6 శాతం, గనులు 9.8 శాతం, విద్యుత్ 1.8 శాతం క్షీణించాయి.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications