Super Stock: అదేంటో ఈ త్రైమాసికంలో చాలా కంపెనీలు మంచి రాబడులను నమోదు చేయటంతో పాటు ఇన్వెస్టర్లకు సైతం మంచి ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక కంపెనీ తాజాగా డివిడెండ్, బోనస్ షేర్లను ఇవ్వటంతో పాటు స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది IIFL వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కంపెనీ గురించే. కంపెనీ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ క్రమంలో 10 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తూ రూ.415 కోట్లకు చేరుకుంది. Q3లో మంచి ఫలితాలతో పాటు తన ఇన్వెస్టర్లకు మరిన్ని లాభాలను అందించాలని కంపెనీ నిర్ణయించింది.

హ్యాపీగా ఇన్వెస్టర్లు..
మంచి ఆర్థిక ఫలితాలను నమోదు చేసిన కంపెనీ ప్రతి షేరుకు రూ.17 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. దీనికి తోడు ఇన్వెస్టర్లు కలిగి ఉన్న ఒక్కో షేరుకు మరో షేరును బోనస్ రూపంలో ఐఐఎఫ్ఎల్ అందించనుంది. దీనికి తోడు షేర్లను 1:2 రేషియోలో స్ప్లిట్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రకటనల నేపథ్యంలో స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయి ధర అయిన రూ.2,029.65 స్థాయికి చేరుకుంది.

డెడ్ లైన్ ఎప్పటి వరకు..
డివిడెండ్ చెల్లింపుకు జనవరి 30, 2023ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ డివిడెండ్ సొమ్మును ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 18, 2023 శనివారం లేదా అంతకు ముందు చెల్లిస్తుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో మార్చి 18, 2023 నాటికి స్టాక్ స్ప్లిట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పెంచటంతో పాటు మార్కెట్లో లిక్విడిటీని పెంచాలని కంపెనీ భావిస్తోంది. దీనికి తోడు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను కూడా ప్రకటించారు.

సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు..
IIFL వెల్త్ మేనేజ్‌మెంట్ డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం 12.2% పెరిగి రూ.171.54 కోట్లకు చేరుకుంది. Q3 FY23లో మొత్తం ఆదాయం రూ.530.95 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 570.62 కోట్లతో పోలిస్తే ప్రస్తుతం 7 శాతం క్షీణించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications