Stock Market: మార్కెట్ల ప్రయాణం ప్రస్తుతం రోలర్ కోస్టర్ మాదిరిగా ఉంది. గత వారం సూచీలు రక్తశిక్తంగా మారటంతో మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగింది. సెన్సెక్స్ సూచీ వేల పాయింట్లు కోల్పోయింది. అయితే వచ్చే వారం మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుంటాయా లేక మరింతగా నష్టాల్లోకి జారుకుంటాయా అనే ఆందోళనలో ఇన్వెస్టర్లు ఉన్నారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

మార్కెట్లకు భయాలు..
డిసెంబర్ 1, 2022న రికార్డు గరిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత కీలక బెంచ్‌మార్క్ సూచీలు నిరంతరం పతనమవుతున్నాయి. అలా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపుగా 3.5 శాతం ఆవిరయ్యాయి. దీనికి ప్రధానంగా ద్రవ్యోల్బణం వల్ల ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో పాటు విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు భయాలకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 నుంచి భారత స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మెుదలైంది. గత శుక్రవారం మాత్రం మార్కెట్లు భారీగా నష్టపోయి లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను కరిగించేశాయి.

IIFL సెక్యూరిటీస్..
రిటైల్ ఇన్వెస్టర్ స్టాక్ పోర్ట్‌ఫోలియో తీవ్రంగా దెబ్బతిన్న తరుణంలో, దలాల్ స్ట్రీట్ పరిశీలకులు మార్కెట్ బాటమ్ గురించి అంచనా వేస్తున్నారు. అయితే దేశీయ మార్కెట్లలో ట్రెండ్ రివర్సల్ త్వరలోనే వస్తుందని IIFL సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ అంచనా వేస్తున్నారు. రానున్న సోమవారం లేదా మంగళవారం మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టవచ్చని ఆయన అంటున్నారు. మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉన్నందున పొజిషనల్ ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను తీసుకోవడం ప్రారంభించాలని సూచించారు.

మార్కెట్లు ఎందుకు లాభాల్లోకి వస్తాయంటే..
ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌కు సంజీవ్ భాసిన్ మార్కెట్లు తిరిగి బౌంన్స్ బ్యాక్ కావటానికి గల కారణాలపై వివరణ ఇచ్చారు. ఆయన అంచనాల ప్రకారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు మార్కెట్ ఊహించినదానికంటే ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. పైగా కీలకమైన బెంచ్ మార్క్ సూచీలు ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉన్నాయి. అందువల్ల దేశీయ మార్కెట్లలో ఇక పతనం చాలా తక్కువగా ఉంటుందని ఆయన లెక్కగట్టారు. ఈ కారణాల వల్ల మార్కెట్లు బుల్స్ తిరిగి తమ ఆధిపత్యాన్ని అందిపుచ్చుకుంటారని ఆయన భావిస్తున్నారు.

చమురు ధరలు, డాలర్..
ఇక ముడి చమురుతో పాటు యూఎస్ డాలర్ సైతం బలహీనంగా ఉన్నాయి. ఇది భారత్ తో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు చాలా కీలకమైన సంకేతం. ఇవి మార్కెట్లు తిరిగి పుంజుకునేందుకు దన్నుగా నిలివనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గత వారం ఎగుమతులపై ఆధారపడే కంపెనీల షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇవి తిరిగి కోలుకోవచ్చని తెలుస్తోంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications