WhatsApp Loan: వాట్సాప్ ద్వారా రూ.10 లక్షల లోన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!
వాట్సాప్ లో చాటింగే కాదు.. లోను కూడా తీసుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే.. IIFL ఫైనాన్స్ వాట్సాప్ ద్వారా తన కస్టమర్లకు రూ. 10 లక్షల వరకు బిజినెస్ లోన్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. ఇది ఇన్‌స్టంట్ అప్రూవల్ లోన్. IIFL ఫైనాన్స్ MSME లోన్ పరిశ్రమల కోసం ఈ సౌకర్యం కల్పించింది. రుణ దరఖాస్తు నుంచి డబ్బు బదిలీ వరకు 100% డిజిటల్ ప్రక్రియే అని కంపెనీ తెలిపింది.
భారతదేశంలో 450 మిలియన్లకు పైగా WhatsApp వినియోగదారులతో, మీరు IIFL ఫైనాన్స్ నుంచి ఈ 24x7 ఎండ్-టు-ఎండ్ డిజిటల్ లోన్ సదుపాయాన్ని పొందవచ్చు. IIFL ఫైనాన్స్ 10 మిలియన్లకు పైగా కస్టమర్‌లను కలిగి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ NBFCలలో ఐఐఎఫ్ఎల్ ఒకటి. ఈ కంపెనీకి దేశమంతటా బ్రాంచ్‌లు ఉన్నాయి. మీరు వాట్సాప్ లో రుణం పొందలాంటే మీరు చేయాల్సిందల్లా AI-bot అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే.

మీ అప్లికేషన్ అవసరమైన అన్ని వివరాలతో సరిపోలితే, మీరు ఏ సమయంలోనైనా మీ లోన్ పొందుతారు. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితం. మీరు 9019702184కి సాధారణ "హాయ్"ని పంపడం ద్వారా లోన్ ప్రక్రియ ప్రారంభించవ్చచు. IIFL ఫైనాన్స్ ప్రస్తుతం తన WhatsApp లోన్ ఛానెల్ ద్వారా 1 లక్ష MSME క్రెడిట్ విచారణలను నిర్వహిస్తోంది.
వాట్సాప్ ద్వారా లోని అవ్వడమనేది వ్యాపారులపై ఎక్కువ దృష్టి పెడుతుందని IIFL ఫైనాన్స్ బిజినెస్ హెడ్ భరత్ అగర్వాల్ చెప్పారు. వాట్సాప్‌లో సాధారణ పేపర్‌లెస్ ఆఫర్ ద్వారా రుణ దరఖాస్తు సులభతరం చేస్తుందన్నారు. ఈ వాట్సాప్ సేవలు చాలా కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. కానీ వాట్సాప్ ద్వార లోన్ ఇవ్వడం ఐఐఎఫ్ఎల్ లోనే ప్రథమమని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications