RBI News: ఆర్బీఐ దెబ్బకు రెండు కంపెనీలు ఫసక్.. 20 శాతం కుప్పకూలిన స్టాక్స్.. జాగ్రత్త
IIFL-JM Financial: 2024 ప్రారంభం నుంచి రిజర్వు బ్యాంక్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు సంచలనాలకు కారణం అవుతున్నాయి. కరోనా తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థను స్థిరంగా ఉంచే క్రమంలో ఆర్బీఐ కఠిన వైఖరి మంచిదే అయినప్పటికీ అటు కంపెనీలతో పాటు వాటిలో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
రెండు రోజుల ముందర ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ, గోల్డ్ లోన్ వ్యాపారంలో పేరున్న కంపెనీ అయిన ఐఐఎఫ్ఎల్ బంగారు రుణాల వ్యాపారాన్ని తక్షణం నిలిపివేయాలని రిజర్వు బ్యాంక్ ఆదేశించింది. దీంతో వరుసగా రెండో రోజు సైతం కంపెనీ షేర్లు 20 శాతం క్షీణతను నమోదు చేశాయి. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు కంపెనీ భవితవ్యం, లాభదాయకతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ లోన్ వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేయటం వల్ల కంపెనీ ఆదాయాలు దెబ్బతిని రానున్న త్రైమాసిక ఫలితాల్లో ప్రభావం బయటపడుతుందని వారు చెబుతున్నారు. ఐఐఎఫ్ఎల్ పై రిజర్వు బ్యాంక్ ఆంక్షలు మాత్రం ఇదే వ్యాపారంలో ఉన్న మణప్పురం, ముతూట్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.

ప్రస్తుతం ఐఐఎఫ్ఎల్ కంపెనీ షేర్ ధర దాదాపు రూ.382.80 వద్ద కొనసాగుతోంది. అలాగే విదేశీ బ్రోకరేజ్ హౌస్ జెఫరీస్ IIFL ఫైనాన్స్ షేర్లను డౌన్‌గ్రేడ్ చేసింది. బ్రోకరేజ్ కంపెనీ షేర్ల టార్గెట్ ధరను రూ.765 నుంచి రూ.435కి తగ్గించింది. గోల్డ్ లోన్ వ్యాపారంపై ఆర్బీఐ చర్యలు లాభదాయకతను ప్రభావితం చేస్తాయని జెఫరీస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు IIFL ఫైనాన్స్ షేర్లు సుమారు 37% క్షీణించాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ.602.95 నుంచి రూ.382.80కి పడిపోయాయి. అలాగే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి ధర రూ.704.20గా ఉంది.

రిజర్వు బ్యాంక్ కఠిన ఆదేశాలతో పతనమైన మరో స్టాక్ JM ఫైనాన్షియల్. నేడు మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు ఏకంగా 19 శాతం మేర క్షీణతను నమోదు చేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కంపెనీ రుణాల పంపిణీపై ఆంక్షలు విధించిన ఒక రోజు తర్వాత స్టాక్ కుప్పకూలింది. మార్చి 5న రిజర్వు బ్యాంక్ JM ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ని షేర్లు, డిబెంచర్ల తకఖాకు వ్యతిరేకంగా రుణాలు ఇవ్వకుండా నిరోధించింది. అలాగే ఐపీవోలకు ఫండింగ్ కూడా నిలిపివేయాలని తక్షణ అమలులోకి వచ్చే ఆదేశాలు జారీ చేయటంతో ఇన్వెస్టర్లు షేర్ల విక్రయానికి దిగారు.


Click it and Unblock the Notifications