IFCI Shares: గందరగోళంగా ఉన్న మార్కెట్ పరిస్థితుల్లోనూ మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం తమపని తాము చేసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఏడాది కూడా పూర్తి కాకముందే పెట్టుబడిదారులకు కాసుల పంట కురిపిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రైస్ షాకర్స్ స్టాక్ ఐఎఫ్‍సిఐ కంపెనీ గురించే. 10 నెలల కిందట షేర్ ధర కేవలం రూ.9 మాత్రమే. అయితే నేడు మార్కెట్లో ఒక్కో షేరు ధర రూ.61.05 వద్ద ఉన్నాయి. ఈ క్రమంలో స్టాక్ ఇవాళ 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. ఎవరైనా ఇన్వెస్టర్ మార్చి 28, 2023న కంపెనీ షేర్లలో లక్ష పెట్టుబడిగా పెట్టి ఉంటే ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం వారి మెుత్తం పెట్టుబడి విలువ రూ.6,78,333కి చేరుకుని ఉండేది. అంటే ఏడాది కూడా నిండ కుండానే పెట్టుబడి విలువ ఏడు రెట్లు పెంపును పొందేవారు.

గడచిన ఐదు రోజుల్లో స్టాక్ ఏకంగా 40 శాతం బంపర్ గెయిన్ ఇన్వెస్టర్లకు అందించింది. ప్రస్తుతం స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.63.85గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ రేటు రూ.9గా ఉంది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో చాలా మంది చూపు ఈ కంపెనీ షేర్లపై ఉంది. ప్రస్తుతం కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న చాలా మంది పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న వాటాలను విక్రయించేందుకు సుముఖంగా లేరు. దీంతో నేడు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,200 కోట్లుగా ఉంది.
IFCI షేర్లు గత 3 నెలల్లో 181% రాబడిని ఇచ్చాయి. గత ఏడాది కాలంలో రూ.లక్ష పెట్టుబడిదారులను రూ.4.81 లక్షలకు మార్చింది. ఈ కాలంలో ఇది 384% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఈ చిన్న స్టాక్ గత మూడేళ్లలో సుమారు 593 శాతం, గత ఐదేళ్లలో 348 శాతం రాబడిని ఇవ్వడం ద్వారా తన పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చేసింది. డిసెంబర్ త్రైమాసిక డేటా ప్రకారం కంపెనీలో సంస్థాగత విదేశీ ఇన్వెస్టర్లు(FII) తమ వాటాను 1.87 నుంచి 2.08 శాతానికి పెంచుకున్నారని వెల్లడైంది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ వాటాను 1.97 నుంచి 1.98 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు కంపెనీలో 70.32 శాతం వాటా ఉంది.


Click it and Unblock the Notifications