post office savings schemes: తాజాగా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఆర్‌బిఐ వరుసగా రెండుసార్లు రెపో రేటును తగ్గించిన తర్వాత బ్యాంకులు ఈ కోత విధించాయి. FDలపై వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా ఎక్కువగా నష్టపోయేది సీనియర్ సిటిజన్లు ఇంకా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని పెట్టుబడిదారులు. అయితే ఎక్కువ వడ్డీ స్కీమ్స్ మరికొన్ని కూడా ఉన్నాయి. అందులో పోస్టాఫీసులో ఇలాంటి చాల పొదుపు పథకాలు ఉన్నాయి, వీటిపై 8.2% వరకు వడ్డీ వస్తుంది. అంటే బ్యాంక్ FD కంటే ఎక్కువ. ఈ పథకాల ఏంటో, వాటి గురించి మీకు తెలుసా...

సుకన్య సమృద్ధి పథకం: సుకన్య సమృద్ధి యోజన కింద సంవత్సరానికి కనీసం రూ. 250తో అలాగే అత్యధికంగా రూ. 1.5 లక్షల డిపాజిట్ చేయొచ్చు. అది కూడా మీరు మీ కూతురి పేరు మీద ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం, దీనికి 8.20% వడ్డీ లభిస్తోంది. ఈ పథకం ప్రతి ఆడపిల్లకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సహాయపడుతుంది ఇంకా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా అందిస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కనిష్ట పెట్టుబడి రూ. 1,000 నుండి గరిష్ట పెట్టుబడి రూ. 30 లక్షలు. ఈ పథకం పై కూడా 8.20% వడ్డీని అందిస్తున్నారు. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు ఇంకా పెట్టుబడికి కనీస వయస్సు 60 సంవత్సరాలు. అలాగే సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను మినహాయింపు అందిస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సంవత్సరానికి కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంపై 7.10% వడ్డీ రేటు ఇస్తుంది. ఈ పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు ఇంకా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర: కిసాన్ వికాస్ పత్రలో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు అలాగే గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు, ఇందులో 7.50% వడ్డీ రేటును వస్తుంది. మీ పెట్టుబడి 2.5 సంవత్సరాల తర్వాత తిరిగి పొందవచ్చు అలాగే దినిపై ఎటువంటి పన్ను ప్రయోజనం ఉండదు.
5 సంవత్సరాల NSC: 5 సంవత్సరాల NSC కనీస పెట్టుబడి రూ. 1,000 ఇంకా గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు, దీనిపై 7.70% వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి ఇంకా TDS కోత ఉండదు.


Click it and Unblock the Notifications