LIC Kanyadan: రోజుకు రూ.130 లతో మీ కుమార్తెకు రూ.26 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీని రూపొందించింది. ఈ పాలసీ పేరు ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ. ఈ పాలసీ తక్కువ సంపాదన ఉన్న తల్లిదండ్రులకు కుమార్తెల వివాహానికి కార్పస్‌ను సేకరించడంలో సహాయం చేస్తుంది.ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ కింద పెట్టుబడిదారుడు రోజుకు రూ. 130 (సంవత్సరానికి రూ. 47,450) డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత ఎల్ఐసీ దాదాపు రూ. 27 లక్షలు చెల్లిస్తుంది.

LIC కన్యాదాన్ పాలసీలో నమోదు చేసుకోవడానికి పెట్టుబడిదారుడి కనీస వయస్సు 30 సంవత్సరాలు, పెట్టుబడిదారుడి కుమార్తె కనీస వయస్సు ఒక సంవత్సరం ఉండాలి. ఒక వ్యక్తి రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని తీసుకుంటే.. అతను 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ప్రీమియం రూ. 1,951 (సుమారుగా) ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత, పాలసీదారుకు ఎల్‌ఐసీ సుమారు రూ. 13.37 లక్షల మొత్తాన్ని చెల్లిస్తుంది.

If you save Rs.130 per day in LIC Kanyadan, you will get Rs.26 lakhs

అదేవిధంగా ఒక వ్యక్తి రూ.10 లక్షల పాలసీ తీసుకుంటే అతను 25 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ప్రీమియం రూ. 3,901 (సుమారుగా) ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ఎల్‌ఐసీ రూ.26.75 లక్షలు చెల్లిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C ప్రకారం పెట్టుబడిదారుడు చెల్లించిన ప్రీమియంలపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.

ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ 25 సంవత్సరాలు అయినప్పటికీ మీరు 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగిలిన 3 ఏళ్లు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పాలసీని తీసుకోవాలని అనుకొనేవారికి జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ పాస్ బుక్ తప్పనిసరిగా ఉండాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+