PPF: నెలకు రూ.12,500 లతో రూ.40 లక్షల కచ్చితమైన రాబడి..!
చాలా మంది రిస్క్ తక్కువ ఉన్న పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా గ్యారెంటీ రిటర్న్స్ వచ్చే వాటిలో ఎక్కువగా పొదుపు చేస్తుంటారు. తక్కువ రిస్క్ ఉండి.. కచ్చితమైన రాబడి వచ్చే పథకాల్లో ఒకటి పీపీఎఫ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) ప్రభుత్వ పథకం.
ఈ పథకం పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పీపీఎఫ్ మెచ్యూరిటీ టైమ్ 15 ఏళ్లు ఉంటుంది. మీరు ఇంకొ 10 ఏళ్ల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఈ పథకంలో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500 గరిష్ఠంగా రూ.1,50,000 పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులు 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ లో 7.1 శాతంగా ఉంది. ఉదాహరణకు మీరు నెలకు 12,500 పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడతారు. అంటే 15 సంవత్సరాలకు 22,50,000 పెట్టుబడి పెడతారు. మీకు వడ్డీ 18, 18, 209 కలుపుకుని మొత్తం 40,68,209 వస్తాయి.

మీరు మెచ్యూరిటీ 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకోవచ్చు. దీని వల్ల మీకు వచ్చే డబ్బు పెరుగుతోంది. మీరు మీ పిల్లల పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు.కానీ సంరక్షకుడిగా తల్లి గానీ తండ్రి గానీ ఉండాలి. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ సడ్మిట్ చేసి వారిపై ఖాతాను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో నామినీగా కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పథకంలో నామినీ కచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది.
చాలా మంది అనుకోవచ్చు సంత్సరానికి ఇంత డబ్బు పొదపు చేయడం తమ వల్ల కాదని. కానీ మీరు రోజుకు రూ.400 పొదుపు చేస్తే మీ భవిష్యత్ అయినా.. మీ పిల్ల భవిష్యత్ కు అయినా మంచి ఆర్థిక భరోసా ఉంటుంది.


Click it and Unblock the Notifications