చాలా మంది పెట్టుబడి పెట్టేటప్పుడు రాబడితో పాటు పథకం నమ్మకమైనది అవునా కాదా అని కూడా తెలుసుకుంటారు. నమ్మకమైన పథకాల్లో ఒకటి పీపీఎఫ్(పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్). ఇందులో పెట్టుబడి సురక్షితం. ఎందుకంటే ఇది ప్రభుత్వ పథకం. అందుకే చాలా మంది పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. అయితే ఇందులో వడ్డీ ఎంత వస్తుంది. మెచ్యూరిటీ పిరియడ్ ఎంత.. ఎంత కడితే ఎంత వస్తాయో తెలుసుకుందాం.
పీపీఎఫ్ సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1,50, 000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. రూ.1,50, 000 ఎక్కువగా పెట్టిబడి పెడితే దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.1,50, 000 వరకు మాత్రం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పీపీఎప్ అకౌంట్ ను పోస్టాఫీస్ తోపాటు ఏ బ్యాంకులోనైనా ఓపెన్ చేయవచ్చు. అయితే పీపీఎఫ్ మెచ్యూరిటీ పిరియడ్ 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ పథకంలో చేరిన 15 సంవత్సరాల తర్వాత మనం డబ్బులు తీసుకోవచ్చు.

ఆ తర్వాత కూడా పథకం కొనసాగించాలనుకుంటే.. 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ లో 7.1 శాతం చెల్లిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది. సంవత్సరానికి రూ.1,50,000 కడితే ప్రస్తుతం ఉన్న 7.1 శాతం వడ్డీతో 15 సంవత్సరాలు పీపీఎఫ్ లో డబ్బు కట్టినట్లయితే 15 సంవత్సరాల తర్వాత రూ.40,68, 209 వస్తాయి. అంటే పెట్టిబడి పెట్టిన మొత్తం 22,50, 000 కాగా.. వడ్డీ 18, 18, 209 వస్తుంది.
పీపీఎఫ్ అకౌంట్ తీసినప్పుడు నామినీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ పీపీఎఫ్ ఖాతాదారుడు మరణించినట్లయితే.. నామికిని డబ్బులు వెళ్తాయి. అయితే ఈ పీపీఎఫ్ లోన్ సౌకర్యం కూడా ఉంది. పీపీఎఫ్ 5 సంవత్సరాలు చెల్లించిన తర్వాత చెల్లించిన మొత్తంలో కొంత మొత్తం రుణం తీసుకోవచ్చు. వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది. సురక్షితమైన, కచ్చితమైన రాబడి కోరుకునే వారు పీపీఎఫ్ పెట్టుబడి పెట్టొచ్చు. కాస్త రిస్క్ తీసుకునే వారు.. మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications