తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చి తీరతాయి .. అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా !!
చాలా మంది రైతులు వ్యవసాయం కలిసి రావడం లేదు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటారు. ఇక వ్యాపారం చేసేవారు ఈ వ్యాపారాల కంటే ఏదైనా జాబ్ చేసుకుంటే మేలు అనుకుంటారు. ఇక జాబ్ చేసేవాళ్ళు, ఈ జాబ్ చెయ్యలేము ఏదైనా బిజినెస్ చేద్దాము అనుకుంటారు. ఇలా మనం చేసే పని మీద తప్ప పక్క పని లాభసాటిగా ఉంటుందన్న భావన చాలా మందిలో ఉంటుంది.
ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఉద్యోగం పోయిందని, జాబ్ చేయడం ఇష్టం లేదని, బిజినెస్ కానీ వ్యవసాయం గా ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం అని ఫీల్ అయ్యే వాళ్లకు తక్కువ ఖర్చుతో లాభసాటిగా ఉండే అద్భుతమైన ప్లాన్ లను చాలా మంది అమలు చేసి చూపిస్తున్నారు.

లక్ష పెట్టుబడి పెట్టి నాలుగు నెలల్లో 8 లక్షలు సంపాదించిన రైతు
ఇక తాజాగా యూపీ కి చెందిన ఓ రైతు తాను వేసిన పంట ద్వారా నాలుగు నెలల్లో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించాడు.
అసలు ఇంతకీ అతను వేసిన పంట ఏంటి అంటే .. దుర్గా ప్రసాద్ అనే రైతు దోస పంట వేసి నాలుగు నెలల్లోనే ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించారు. ఏ నేలలో అయినా ఈజీగా పండే దోస కాయలు, ముఖ్యంగా కాస్త ఇసుక నేలలుగా ఉంటే మరింత దిగుబడిని అందిస్తాయి . 60 నుంచి 80 రోజుల్లో చేతికి వచ్చే దోస పంటను సాగు చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆర్జించాడు.

నెదర్ల్యాండ్ దోస రకాన్ని సాగు చేసిన రైతు ..
నెదర్లాండ్స్ రకం దోసకాయ పంట వేసిన సదరు రైతు 72 వేల రూపాయలు విత్తనాల కోసం ఖర్చు పెట్టాడు. ఇకపై పైన ఖర్చులన్నీ కలిపి లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టాడు. పండించిన దోసకాయలను విక్రయించటం లో కూడా తెలివితేటలను ఉపయోగించాడు. హోటల్స్ , రెస్టారెంట్స్ వాళ్లకు ప్రతి రోజూ దోసకాయల అవసరం ఉండే నేపథ్యంలో పెద్ద పెద్ద హోటళ్ళు , రెస్టారెంట్లకు దోసకాయలను విక్రయించాడు. సరైన సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు .

ఎందులో పెట్టుబడి పెట్టాలి ? ఏ సమయంలో పెట్టాలి తెలియటమే ముఖ్యం
అంతేకాదు సాధారణ దోసకాయ కేజీ ధర 20 రూపాయలు ఉంటే, నెదర్లాండు రకం దోసకాయల కేజీ ధర 50 రూపాయలు కావటంతో రైతు ఎంచుకున్న రకం అతన్ని లాభాల బాటలో నడిపించింది . మొత్తానికి డిమాండ్ బట్టి , మార్కెట్ అవసరాలను బట్టి దోస సాగు చేసిన సదరు రైతు నాలుగు నెలల కాలంలో లక్ష రూపాయల పెట్టుబడితో ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించాడు. సంపాదించాలన్న ఆలోచన ఉండటం కాదు, ఏ సమయంలో దేనిపై పెట్టుబడి పెట్టాలి ఆలోచన ఉండటం ప్రధానమని యూపీ కి చెందిన రైతు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు.

మార్కెటింగ్ అవసరాలు .. టెక్నిక్స్ తెలిస్తే వ్యవసాయం అయినా , బిజినెస్ అయినా పంట పండినట్టే
మరి ఇంకెందుకు ఆలస్యం వ్యవసాయం దండగ అనుకునే రైతులంతా డిమాండ్ వున్న పంటలను, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను, తక్కువ చీడపీడలు వచ్చే పంటలను, నేల రకాన్ని బట్టి ఎంచుకుని సాగుచేస్తే, మార్కెటింగ్ టెక్నిక్స్ ను కూడా నేర్చుకుంటే వ్యవసాయంలో అదిరిపోయే సంపాదనను కళ్ళచూడవచ్చు .


Click it and Unblock the Notifications