ఈ రోజుల్లో ప్రతిఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి. ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ పెరుగుతున్న కొద్దీ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు కూడా పెరుగుతున్నారు. అయితే బ్యాంక్ అకౌంట్స్ లో సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సాధారణంగా స్టూడెంట్ నుండి ఉద్యోగి, వ్యాపారి వరకు ప్రతి ఒక్కరికి ఉండేది సేవింగ్స్ అకౌంట్. ఈ సేవింగ్స్ అకౌంట్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, దీని పై బ్యాంకులు ఏమైనా ఫైన్ విధిస్తాయా.. ఇలాంటి అనుమానాలపై ఆర్బిఐ క్లారిటీ ఇచ్చింది.
ఇండియాలో ప్రస్తుతం చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్నాయి. ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే జరిమానా విధించే అవకాశం ఉందన్న ఒక వార్త సోషల్ మీడియాలో ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది, ప్రత్యేకించి ప్రైవేట్ కంపెనీలలో పని చేస్తున్న వారిని. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీల్లో చాలా మంది ఉద్యోగులకి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటాయి.

మీరు ఎక్కడైనా ఉద్యోగాలు మారినప్పుడు కొత్త కంపెనీ పార్ట్నర్షిప్ బ్యాంక్‌తో మీ కోసం సాలరీ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తుంది. దింతో కొందరికి రెండు, నాలుగు లేదా ఐదు ఇలా వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్స్ మ్యానేజ్ చేయాల్సి వస్తుంది. ఆర్బీఐ మాజీ గవర్నరుని సూచిస్తూ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్న వారు భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని ఒక వార్త వెలువడింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఈ వార్త పై ఫాక్ట్ చెక్ నిర్వహించి కొట్టి పారేసింది. PIB ప్రకారం, కొన్ని కథనాలు రెండు బ్యాంకు అకౌంట్స్ ఉంటే జరిమానా విధించబడుతుంది అని అపోహను వ్యాప్తి చేస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ మాత్రం అలాంటి మార్గదర్శకాలేవీ జారీ చేయలేదు. ఈ వార్త పూర్తిగా తప్పు. ఇలాంటి పుకార్లు, తప్పుదోవ పట్టించే వార్తలను అస్సలు నమ్మవద్దని పీఐబీ ప్రజలకు సూచించింది.
భారతదేశంలో ఒక వ్యక్తికి ఉండాల్సిన బ్యాంకు అకౌంట్స్ గురించి ఎలాంటి రూల్ లేదు. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ అయినా తెరవవచ్చు. దీనికి ఆర్‌బీఐ ఎలాంటి రూల్స్, కండిషన్స్ విధించలేదు. అయితే మీరు ఎన్ని ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే వాటిలో కనీస బ్యాలెన్స్ మైంటైన్ చేయాలి. మీరు ఇలా చేయకపోతే మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. అయితే sms అలర్ట్స్, ఎటిఎం చార్జెస్ లాంటివి ఉంటాయని గమనించాలీ.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications