మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీలలో ఒకరైన బిల్ గేట్స్ ఇండియన్ స్టార్టప్‌లకు, టెక్నోక్రాట్స్‌కు ఒక సవాల్ విసిరారు. ఫీచర్ ఫోన్లలోనూ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ అందించిన వారికి 50 వేల డాలర్ల రివార్డును ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
'ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు: అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై ఇటీవల బెంగళూరులో జరిగిన ప్యానల్ డిస్కషన్‌లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ), సీఐఐ డాట్ కో ఈ గ్రాండ్ ఛాలెంజ్‌ను ప్రకటించాయి.

నేటికీ సగానికిపైగా జనాభా వద్ద అవే...
స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఏ సమయంలోనైనా ఇంటర్నెట్ ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) యాప్ ఉపయోగించి నగదు బదిలీ, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తుంటారు. అయితే మన దేశంలో ప్రస్తుతం 4జీ నెట్ వర్క్ అందుబాటులో ఉన్నా.. నేటికీ సగానికిపైగా జనాభా ఫీచర్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. ఇవి 2జీ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తాయి. స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫీచర్లు, సౌకర్యాలు ఈ 2జీ మొబైల్ ఫోన్లలో ఉండవు. కాబట్టి వీటిలో నగదు బదిలీ, ఆన్‌లైన్ లావాదేవీల నిర్వహణ సాధ్యం కావడం లేదు.

ఫీచర్ ఫోన్ల కోసం.. అసలైన ఛాలెంజ్?
డిజిటల్ పేమెంట్ సాధనాలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) చాలా పాపులర్ అయింది. ప్రతి నెలా కోట్లాది లావాదేవీలు ఈ యూపీఐ ప్లాట్‌ఫామ్‌పైనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫీచర్ ఫోన్లకు కూడా ఇలాంటి ఒక పేమెంట్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చేయాలన్నదే ఈ పోటీ అసలు లక్ష్యం. ఎన్‌పీసీఐ, సీఐఐఈ డాట్ కో, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ గ్లోబల్ ఛాలెంజ్ విసిరాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ ప్యానెల్ డిస్కషన్ సందర్భంగా బిల్ గేట్స్ భారతీయ ఔత్సాహిక టెక్నోక్రాట్స్, స్టార్టప్‌లకు ఈ సవాల్ విసిరారు.

దరఖాస్తుకు గడువు తేదీ 2020 జనవరి 12...
ఫీచర్ ఫోన్లకూ యూపీఐ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను డెవలప్ చేసే విషయంలో నిర్వహిస్తోన్న ఈ ఛాలెంజ్‌లో వ్యక్తులుగాని, సంస్థలుగాని పాల్గొనవచ్చు. 2020 జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు కేవలం ఆన్‌లైన్ ద్వారానే స్వీకరిస్తారు. అనంతరం మోస్ట్ ప్రామిసింగ్ సొల్యూషన్స్‌ను సీఐఐఈ డాట్ కో, ఎన్‌పీసీఐ దరఖాస్తులను వడపోస్తాయి. ఎంపికైన వ్యక్తులు, సంస్థలకు టెక్నికల్ అవసరాలు తీర్చడంతోపాటు వారి సొల్యూషన్స్‌ను డెవలప్ చేసుకోవడానికి ఎన్‌పీసీఐ.. ఏపీఐ యాక్సెస్‌ను అందిస్తాయి.

ఫిబ్రవరి 11, 2020న బుంబైలో ఈవెంట్...
ఎంపికైన వ్యక్తులు, సార్టప్‌లు 2020 ఫిబ్రవరి 11న ముంబైలో జరిగే ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్‌ల తమ తమ సొల్యూషన్స్‌ను ప్రదర్శించిన అనంతరం.. 2020 మార్చి 14న విజేతలను ప్రకటిస్తారు. విజయవంతంగా ఫీచర్ ఫోన్లకు యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన వ్యక్తులు లేదా స్టార్టప్‌కు రూ.50 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ.35, 89,788.46) నగదు బహుమతి అందిస్తారు. తొలి రన్నరప్‌కు 30 వేల డాలర్లు (రూ.21,51,295.43), రెండో రన్నరప్‌కు 20 వేల డాలర్లు (రూ.14,28,587) నగదు బహుమతులు అందజేస్తారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications