మీ అకౌంట్లో ఇంతకంటే ఎక్కువ డబ్బు వేస్తే ఏమవుతుందో తెలుసా.. ఈ రూల్ మర్చిపోవద్దు..
మనము ఎదో ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉపయోగిస్తుంటాము. సేవింగ్స్ అకౌంట్ నుండి లోన్ ఈఎంఐ కట్టడం, యుపీఐ పేమెంట్స్ చేయడం, డెబిట్ కార్డ్ ద్వారా మని విత్ డ్రా ఇలా చాల ట్రాన్సక్షన్స్ చేస్తుంటాము. అందుకే సాధారణంగా ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ అవసరాలను తీర్చుకోవడానికి కనీసం ఒక సేవింగ్స్ అకౌంట్ ఉపయోగిస్తుంటారు. సేవింగ్స్ అకౌంట్లో మీరు అత్యధికంగా ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చో మీకు తెలుసా ? ఒక లిమిట్ మించి డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తుంది.
10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే
ఏదైనా బ్యాంకు అకౌంట్లో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ లేదా విత్‌డ్రా ఉంటే ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకులను ఆదేశించింది. నిబంధనల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం ఆదాయపు పన్ను శాఖ (ITD) పరిధిలోకి వస్తుంది. కాబట్టి, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి మీ సేవింగ్స్ అకౌంట్ నుండి రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ లేదా విత్‌డ్రా చేయకుండా ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీరు ఆదాయపు పన్ను శాఖ పరిధి కిందకు వస్తారు. ఆదాయపు పన్ను శాఖ దీనికి సంబంధించి మిమ్మల్ని ఎన్క్వయిరీ చేయవచ్చు, అలాగే మీరు వాటికీ సమాధానం చెప్పవలసి ఉంటుంది.

ఆదాయపు పన్ను శాఖకు సమాచారం
ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఒక వ్యక్తి సేవింగ్స్ అకౌంట్లో రూ. 10 లక్షల కంటే పైగా క్యాష్ డిపాజిట్లు ఆదాయపు పన్ను శాఖకు రిపోర్ట్ చేయబడతాయి. డిపాజిట్లు వివిధ అకౌంట్ల ద్వారా చేసిన బ్యాంకులు ఇలాంటి ట్రాన్సక్షన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)కి నివేదించవలసి ఉంటుంది. ఇంకా ఇలాంటి ట్రాన్సక్షన్ చేసే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా అతను/ఆమె పాన్ లేదా ఆధార్ డాకుమెంట్స్ తప్పనిసరిగా చూపించాలి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, రూ. 50,000 కంటే పైబడిన డిపాజిట్లకు పాన్ నంబర్ తప్పనిసరి. క్యాష్ ట్రాన్సక్షన్ విషయానికొస్తే సెక్షన్ 269ST ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఒక రోజులో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించడాన్ని నిషేధిస్తుంది.


Click it and Unblock the Notifications