ఉద్యోగం ఎక్కడ చేసిన వ్యాపారం ఎక్కడ ప్రారంభించిన సొంత ఊరిలో ఒక ఇల్లు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ప్రస్తుతం ల్యాండ్ రేట్లతో సహా ఇళ్ల ధరలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. అయితే ఇళ్ల ధరలు ప్రదేశాన్ని బట్టి మారవచ్చు. మంచి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనునే వారిలో మీరు కూడా ఉన్నారా... అయితే ఈ వార్త మీకు చాల ఉపయోగకరంగా ఉంటుంది. స్థలం కొనాలంటేనే చాల ఎక్కువ ఖర్చవుతుంది. అలంటి ఒక సొంత ఇల్లు కొనాలంటే భారీ మొత్తం కావాలి. అయితే ఇల్లు కొనేందుకు కొన్ని బెనిఫిట్స్ కల్పిస్తే ఎలా ఉంటుంది... మీకు పెళ్ళై మీ భార్య పేరు మీద ఇల్లు కొంటే చాల ప్రయోజనాలను పొందవచ్చు.
పురుషులతో సమానంగా సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మహిళల పేరుతో చాలా పథకాలను అమలు చేస్తోంది. వీటి వల్ల పురుషులతో పోలిస్తే మహిళలకే అనేక విషయాల్లో రాయితీలు పొందుతున్నారు. మహిళలు ఏదైనా ఆస్తులు కొనేందుకు ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించింది.ఇందుకు ఆస్తి పన్నులో కూడా మహిళలకు ప్రత్యేక మినహాయింపులు కల్పించారు.

కాబట్టి మీరు మీ సొంత ఇంటి కలల ఇంటి కొనాలని ఆలోచిస్తుంటే మీరు దానిని మీ భార్య పేరు మీద కొనుగోలు చేయవచ్చు, ఎందుకంటే ఇలా కొనడం ద్వారా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోతే మీరు హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనాలనుకుంటే దానిని మీ భార్య పేరు మీద కొనడం మంచిది . ఎందుకంటే, భారతదేశంలో పురుషుల కంటే తక్కువ వడ్డీ రేట్లకు మహిళలకు లోన్స్ అందించే చాల బ్యాంకులు ఇంకా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
స్టాంప్ డ్యూటీ మినహాయింపు: కొత్త ఇల్లు కొనేటప్పుడు కొనుగోలు డీడ్(purchase deed) రూపొందించాలి. దీనికోసం చాల డాకుమెంట్స్ జత చేసుకోవాలి. అప్పుడు మీరు ఇంటిని రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి మీరు స్టాంప్ డ్యూటీ కుడి కట్టాలి. ఇంటి ధరను బట్టి మీరు మీ స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉండొచ్చు. కానీ భారతదేశంలో పురుషుల కంటే మహిళలు తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించే రాష్ట్రాలు చాలా ఉన్నాయి.
ఆస్తిపన్ను మినహాయింపు: మహిళలు ఆస్తి సంబంధిత పన్నుల నుండి కూడా మినహాయింపు పొందవచ్చు. కొన్ని మునిసిపాలిటీలు మహిళలకు ఈ మినహాయింపు ఇచ్చాయి. ఏదైనా ఆస్తి మహిళా పేరు మీద ఉన్నప్పుడు మాత్రమే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఆర్థిక భద్రత: ఒక మహిళా పేరు మీద ఏదైన ఆస్తి ఉంటే అది ఆమె ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుంది ఇంకా ఆమెను సొంతంగా నిలబడేల చేస్తుంది. అందువల్ల, ఆమె పూర్తి స్వేచ్ఛతో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అంతేకాకుండా మీ భార్య పేరు మీద ఇల్లు కొన్న తర్వాత మీ భార్య ఇంటి యజమాని కూడా అవుతుంది.


Click it and Unblock the Notifications