Bank Alert: ఈ రోజుల్లో చాలా మందికి అనేక బ్యాంక్ ఖాతాలను, డిజిటల్ చెల్లింపు వ్యాలెట్లను వినియోగిస్తున్నారు. అయితే అందరూ చేస్తున్న అతి పెద్ద తప్పు ఏమిటంటే పాస్‌వర్డ్ విషయంలోనే జరుగుతున్నట్లు గుర్తించబడింది. దీని వల్ల దేశంలో లక్షలాది మంది బ్యాంక్ ఖాతాల వివరాలు ఇప్పుడు ప్రమాదానికి చాలా దగ్గరగా ఉన్నాయి. సైబర్ నేరగాళ్లకు వీరే మెుదటి టార్గెట్.

పెద్ద తప్పు..
మనలో చాలా మంది గుర్తుంచుకోవడానికి సులభమైన పాస్‌వర్డ్‌ను సెటప్ చేయడం చేస్తున్న అతిపెద్ద పని. రోజువారీ మనం చాలా రకాల యాప్స్ వినియోగిస్తున్నందున, ప్రతి దానికీ ప్రత్యేక లాగిన్ కోసం స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను కలిగి ఉండటం కష్టమవుతుంది. అందుకు వీలుగా చాలా మంది సులువైనవి వినియోగిస్తుంటారు. వీటిని హ్యాకర్లు సెకన్ల వ్యవధిలోనే క్రాక్ చేసి వారి సొమ్మును, విలువైవ సమాచారాన్ని తస్కరించటం చాలా పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు తమ ఆన్‌లైన్ ఖాతాలను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని వెల్లడించిన నార్డ్‌పాస్ సంస్థ వెల్లడించింది.

వాడకూడని పాస్‌వర్డ్స్..
సాధారణంగా చాలా మంది వ్యక్తులు "123456", "qwerty", "password" వంటి పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించటం జరిగింది. ఇలాంటి password ఉన్న అకౌంట్లను సైబర్ నేరగాళ్లు కేవలం సెకన్ల వ్యవధిలోనే హ్యాక్ చేయగలరని తేలింది. ఇలాంటి బలహీనమైన పాస్‌వర్డ్‌ల లిస్ట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* 123456
* 123456789
* 12345
* qwerty
* password
* 12345678
* 111111
* 123123
* 1234567890
* 1234567

ఫస్ట్ ప్లేస్ లో..
పైన వెల్లడించిన రకాలైన పాస్‌వర్డ్‌లనే కాక చాలా మంది తమ పేర్లనే అకౌంట్లకు పాస్‌వర్డ్‌లుగా లేదా కోడ్ గా వినియోగించటం చాలా ప్రమాదకరమని వెల్లడించింది. చాలా మంది అనేక దేశాల్లో జంతువులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లలో 'dolphin' అనే దానిని అత్యధికంగా వినియోగిస్తున్నట్లు నార్డ్‌పాస్ పరిశోధనలో వెల్లడైంది. అందుకే క్లిష్టమైన పాస్‌వర్డ్ లను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ చిట్కాలు పాటిస్తే..
* బలమైన పాస్‌వర్డ్ కనీసం 12 అక్షరాలు ఉండేలా చూసుకోవటం మంచిది. ఎందుకంటే సంక్లిష్టమైన పొడవైన పాస్‌వర్డ్‌లను గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతుంది.
* క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ కాంబినేషన్, నంబర్లు, స్పెషల్ సింబల్స్ కలిపి వినియోగించటం వల్ల సేఫ్టీ బాగా పెరుగుతుంది.
* ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి 90 రోజులకు ఒకసారి పాత పాస్‌వర్డ్‌లను మార్చటం చాలా ఉత్తమం. దీని వల్ల సేఫ్టీ బాగా పెరుగుతుంది.


Click it and Unblock the Notifications