SIM: అలా సిమ్ తీసుకుంటే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే..
చాలా మంది ఇబ్బడిముబ్బడిగా సిమ్ లు తీసుకుంటారు. అయితే అందులో చాలా మంది తప్పుడు ఐడెంటీతో సిమ్ తీసుకుంటారు. ఇది నేరం. తప్పుడు ఐడెంటీతో సిమ్ తీసుకుని చాలా మంది అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారు. అందుకే తప్పు ధృవీకరణ పత్రాలతో సిమ్ తీసుకుంటే ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని టెలికాం శాఖ భావిస్తోంది.ఇందుకు సంబంధించి త్వరలో బిల్లు తీసుకొస్తామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ చెప్పారు.

6-10 నెలల్లో
టెలికాం నూతన బిల్లును వచ్చే 6-10 నెలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ప్రాథమిక ముసాయిదా పార్లమెంటు కమిటీకీ పంపిస్తామన్నారు. ఆ తర్వాత పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. ఇందుకు 6-10 నెలల సమయం పడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ముసాయిదా బిల్లుపై ప్రజలు అభిప్రాయాలు తెలిపేందుకు అక్టోబరు 20ను గడువు తేదీగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మూడు చట్టాలు- ద ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం- 1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం- 1993, టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం- 1950 స్థానంలో కొత్తవి తేవాలని ప్రతిపాదన ఉంది.

వాట్సప్, జూమ్, గూగుల్ డుయో
ఇప్పుడున్న ముసాయిదాను మార్పు లేకుండా బిల్లుగా మారిస్తే, కాలింగ్, మెసేజింగ్ సేవలు అందిస్తున్న వాట్సప్, జూమ్, గూగుల్ డుయో వంటి సంస్థలూ టెలికాం లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తుంది. టెలికాం లైసెన్సు పరిధి కిందకు వస్తే ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ యాప్‌లు కూడా కేవైసీ నిబంధనలను కచ్చితంగా ఫాలో కావాలి. వినియోగదార్లకు భద్రతను కల్పించడమే నూతన బిల్లు ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.

సరైన సమాచారం
అలాగే ఆపరేటర్ల నుంచి సేవలు పొందుతున్నప్పుడు, సరైన సమాచారం ఇవ్వడం వినియోగదారుల బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు. టెలికాం సేవల కోసం తప్పుడు వివరాలు (ఐడెంటిటీ) ఇస్తే ఏడాది వరకు జైలు శిక్ష విధించాలని కూడా బిల్లు ప్రతిపాదించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే టెలికాం సంస్థలకు ఒక్కో సర్కిల్‌పై గరిష్ఠ జరిమానా విధింపు పరిమితిని రూ.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించాలని ముసాయిదాలో చేర్చారు.


Click it and Unblock the Notifications