వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబిడెన్ ముందున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం గం.10 సమయానికి బిడెన్ 192, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ 114 ఎలక్ట్రోరల్ ఓట్లతో ఉన్నారు. ఎవరు విజయం సాధించాలన్నా 270 రావాలి. ఇప్పటికే బిడెన్ 200కు చేరుకున్నారు. ట్రంప్ చాలా దూరంలో ఉన్నారు. 90 స్థానాల వరకు బిడెన్ ముందంజలో ఉన్నారు. జోబిడెన్ గెలిస్తే భారత్‌తో, నరేంద్ర మోడీ ప్రభుత్వంతో సంబంధాలు ఎలా ఉంటాయనే చర్చ సాగుతోంది.

మోడీతో మూడో అధ్యక్షుడి డీల్.. అడ్డంకులా..
నరేంద్ర మోడీ 2019లో వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2014లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సమయంలో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత ట్రంప్ విజయం సాధించారు. ఇప్పుడు బిడెన్ గెలిస్తే మోడీ ప్రభుత్వంతో డీల్ చేయనున్న మూడో అమెరికా అధ్యక్షులు అవుతారు. ఆర్థిక సంబంధాలు సహా అన్నింటా బిడెన్ ఓపెన్ మైండ్‌తో ఉంటారని పరిశీలకులు భావిస్తారు. ఈ తీరు భారత్-అమెరికా సంబంధాల్లో అడ్డంకులకు అవకాశం లేకపోలేదని అంటున్నారు.

బంధాన్ని బలోపేతం చేస్తారా?
అమెరికా-భారత దేశాలు సహజ భాగస్వాములు అని జో బిడెన్ భావిస్తారని, ఆయన గెలిస్తే దీనిని నిరూపిస్తారని, తద్వారా అమెరికా-భారత్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తారని, ఇందుకు బిడెన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చునని ప్రచారంలో ఆయన శైలిని పరిశీంచిన వారు చెబుతున్నారు. ఏదేమైనా బిడెన్ అధికారంలోకి వస్తే భారత్-అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ఎన్నో అంశాలు కీలకం..
ఇండియా కొత్త సిటిజన్‌షిప్ అమెంట్‌మెంట్(CAA), జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదా 370 ఆర్టికల్ రద్దు వంటి వివిధ అంశాలపై జోబిడెన్ తీరు విరుద్ధంగా ఉందని, ఇలాంటి అంశాలపై ఆయన తీరుపై కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. అయితే భారత్, అమెరికా టెక్ దిగ్గజాలకు, భారతీయులు సహా వివిధ దేశాల వారికి ఊరటనిచ్చేలా.. ట్రంప్‌కు భిన్నంగా ఆయన నిర్ణయాలు ఉండవచ్చునని అంటున్నారు. ట్రంప్ హెచ్1బీ వంటి అంశాలపై కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?



Click it and Unblock the Notifications