ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా విశాఖపట్నం ఐటీ పరిశ్రమకు అనువైన గమ్యస్థానంగా ఎందుకు అభివృద్ధి చెందుతుందో వివరించారు అలాగే నగరంలో అద్భుతమైన గొప్ప మౌలిక సదుపాయాలు, సబ్సిడీ ధరకు భూమి ఇవన్నీ కూడా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించగలదని అన్నారు. అయితే విశాఖపట్నంలో డెవలప్‌మెంట్ సెంటర్ కోసం 21 ఎకరాల భూమిని టెక్ దిగ్గజం TCS 99 పైసలకు పొందిన అగ్రిమెంట్ వివరాలు ఇవ్వాలని అడిగినప్పుడు లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"99 పైసలకు TCSకి భూమి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ రాజధాని అయిన విశాఖపట్నంలో దాదాపు 12 వేల ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో TCS భూమిని పొందడం పట్ల మేము సంతోషిస్తున్నాము, ఇతర పెద్ద ఐటీ కంపనీలు కూడా విశాఖపట్నంలో టెక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయలని ఆహ్వానించడానికి మేము ఎదురుచూస్తున్నాము. విశాఖపట్నం కేవలం భూమి గురించి మాత్రమే కాదు, మీరు ఐటీ రంగాన్ని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు పోషిస్తున్న పాత్ర చాలా పెద్దది" అని లోకేష్ చెప్పారు.
"మా దగ్గర అద్భుతమైన టేలెంట్ ప్రజలు ఉన్నారు, మాకు గొప్ప మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంగా మేము సబ్సిడీ ధరకు భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. గోవా బెంగళూరును వివాహం చేసుకుని బిడ్డ పొంది ఉంటే, అది విశాఖపట్నం కావచ్చు అని హాస్యోస్పదంగా అన్నారు. మా దగ్గర అన్నీ ఉన్నాయి, విశాఖపట్నంకు పెద్ద పెట్టుబడులు అవకాశాలకి టార్గెట్ ప్రదేశం కావచ్చని మేము నమ్ముతున్నాము" అని అన్నారు. అయితే దీనికి సంబంధించిన ట్వీట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే వైజాగ్‌ను ఒక టెక్నాలజీ హబ్‌గా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా TCSకి ఈ భూమి కేటాయింపు జరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో నారా లోకేష్ నెక్స్ట్ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ సెంటర్ కోసం ఆంధ్రప్రదేశ్‌ను పరిగణించాలని టెక్ దిగ్గజం టీసీఎస్ని కోరారు. తరువాత కొద్దీ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం TCS నిరంతర చర్చలు జరిపింది, చివరికి గత సోమవారం ఏపీ మంత్రివర్గ క్యాబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది.
ఈ చర్య టెక్ పరిశ్రమకు బలమైన సంకేతాలు ఇస్తుందని అధికారులు చెబుతున్నారు: టాప్ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సనంద్‌లోని టాటా మోటార్స్‌కు 99 పైసలకు భూమిని కేటాయించిన సందర్భం ఈ నిర్ణయం గుర్తు చేస్తుంది.


Click it and Unblock the Notifications