insurance policy covergae: ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలోని సగానికి పైగా ప్రజలు ప్రతిరోజూ ఈ సంక్షోభాన్ని చూస్తున్నారు. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన కాల్పుల్లో 29 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో దాదాపు 166 మంది అమాయకులు మరణించారు. ఆ తరువాత కూడా దేశంలోని వివిధ ప్రదేశాలలో ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇలాంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి లేదా గాయపడిన వారికి జీవిత బీమా పాలసీ వర్తిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యక్తికి ఇన్సూరెన్స్ : నిజానికి, గత కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ నిబంధనలలో మార్పులు వచ్చాయి. దింతో ఉగ్రవాదం వల్ల కలిగే నష్టాలు ఎక్కువగా జీవిత బీమా పాలసీలో కవర్ అవుతున్నాయి, అంటే బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు అని. కానీ దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDA) ప్రకారం, ఇప్పుడు జీవిత బీమా పాలసీలలో ఉగ్రవాదం కారణంగా మరణాలు కూడా కవర్ చేస్తాయి. అంటే, ఒక వ్యక్తి ఉగ్రవాద బుల్లెట్ కారణంగా మరణిస్తే అతను లేదా ఆమె సాధారణ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తారు.
పాలసీ తీసుకునే ముందు: కానీ ఒక వ్యక్తి ఉగ్రవాద దాడుల్లో మరణిస్తే ప్రమాదవశాత్తు మరణానికి పేర్కొన్న అదనపు మొత్తం లభించదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ. 50 లక్షల బీమా తీసుకొని ప్రమాదం జరిగితే రూ. 10 లక్షల అదనపు బీమా ఉంటే ఆ వ్యక్తి ఉగ్రవాద దాడిలో మరణిస్తే కుటుంబానికి రూ. 50 లక్షల బీమా మాత్రమే చెల్లిస్తారు. ఈ ప్రమాదాలకు అదనపు బీమా 10 లక్షల రూపాయల వర్తింపు ఉండదు.
ఇల్లు, కార్లకు కూడా బీమా: చాల బీమా కంపెనీలు సాధారణ జీవిత బీమా పాలసీలలో ఉగ్రవాద దాడుల నుండి ఆర్ధిక రక్షణ కూడా అందిస్తాయి. ఈ రోజుల్లో జీవిత బీమాతో పాటు ప్రజలు ఆరోగ్య బీమా, ఇల్లు ఇంకా ఆస్తి బీమా పై కూడా దృష్టి పెట్టాలి. చాలాసార్లు, ఉగ్రవాద దాడుల్లో మొత్తం ఇళ్ళు కూడా ధ్వంసమవడం ఇంకా వాహనాలు కూడా కాలిపోతుంటాయి. మీరు మీ ఇంటికి ఇంకా కారుకు బీమా చేస్తే మీరు క్లెయిమ్ చేసిన వెంటనే మీకు మొత్తం లభిస్తుంది.
క్లెయిమ్ కోసం ఏ డాకుమెంట్స్ అవసరం: డాకుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే బాధితుడి కుటుంబానికి బీమా క్లెయిమ్‌ల కోసం ఎక్కువగా పోలీసు రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ అవసరం. ఉగ్రవాద దాడిలో మరణిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే పద్ధతి చాలా ఈజీ. ఒకసారి క్లెయిమ్ చేసిన తర్వాత, వీలైనంత త్వరగా చెల్లించేందుకు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి లిస్ట్ ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ లేదా మునిసిపల్ రికార్డులో ఉగ్రవాద దాడి కారణంగా మరణిస్తే దానిని డెత్ సర్టిఫికెట్లాగా పరిగణిస్తారు. అయితే ఇతర కారణాలతో ఒక వ్యక్తి మరణిస్తే దర్యాప్తు ప్రక్రియ ఎక్కువకాలం పాటు నిర్వహించాల్సి ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications