అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాలపై సుంకాల బాదుడు మొదలు పెట్టిన సంగతి విదితమే. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్ సాగించిన ఆర్థిక విధానాలు అగ్రరాజ్యం యుఎస్ ముఖ చిత్రాన్నే మార్చివేశాయి. పొరుగు దేశాల నుంచి వచ్చే వస్తువులపై విధించిన సుంకాలతో గత ఏడాది అమెరికా ఖజానాకు దాదాపు 287 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 26 లక్షల కోట్లు) అదనపు ఆదాయం వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను ఆధారంగా చేసుకుని 2024 ఏప్రిల్‌లో భారత్ సహా పలు దేశాలపై సగటున 17 శాతం వరకు సుంకాలు విధించడంతో అమెరికాకు రాబడి విపరీతంగా పెరిగింది. 1932 తర్వాత అమెరికా చరిత్రలో ఇవే అత్యంత కఠినమైన పన్ను విధానాలని ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే IEEPA (International Emergency Economic Powers Act) ఆధారంగా ట్రంప్ తీసుకున్న సుంకాలకు అమెరికా అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో అసలు IEEPA అంటే ఏమిటి అనే అంశం తెరమీదకు వచ్చింది.

ఈ సుంకాలు చట్టబద్ధం కావని స్పష్టం చేస్తూ శుక్రవారం వెలువరించిన తీర్పు.. అమెరికా అధ్యక్ష అధికారాలపై కీలకమైన పరిమితులను మరోసారి గుర్తు చేసింది. ఈ నిర్ణయం ట్రంప్ వాణిజ్య విధానాలకు మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఏ అధ్యక్షుడైనా అత్యవసర చట్టాలను ఎలా ఉపయోగించాలి అన్న అంశంపై ప్రశ్నలకు తెరలేపింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తీర్పు వెలువరించిన సందర్భంగా.. IEEPA (International Emergency Economic Powers Act) చట్టంలో సుంకాలు లేదా దిగుమతి పన్నుల గురించి ఎక్కడా స్పష్టమైన ప్రస్తావన లేదని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో విదేశీ ఆస్తులను స్తంభింపజేయడం.. ఆర్థిక లావాదేవీలను నియంత్రించడం వంటి అధికారాలు మాత్రమే ఈ చట్టం ఇస్తుందని, కానీ సాధారణ వాణిజ్య విధానాల కోసం లేదా ఆదాయం సమకూర్చే పన్నుల విధింపునకు దీనిని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో ట్రంప్ ప్రభుత్వం IEEPA ఆధారంగా వసూలు చేసిన సుంకాలు చెల్లవంటూ తీర్పు వెలువరించింది.
IEEPA అంటే ఏమిటి: ఇది 1977లో అమలులోకి వచ్చిన ఒక అమెరికా సమాఖ్య చట్టం. విదేశాల నుంచి వచ్చే అసాధారణమైన ముప్పుల సమయంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తరువాత అధ్యక్షుడికి కొన్ని ప్రత్యేక ఆర్థిక అధికారాలు ఇవ్వడమే దీని లక్ష్యమని చెప్పవచ్చు. 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ చట్టానికి సంతకం చేశారు. గతంలో అధ్యక్షులు అత్యవసర అధికారాలను అతిగా వినియోగిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో.. వాటికి స్పష్టమైన హద్దులు విధించేందుకే ఈ చట్టాన్ని రూపొందించారు. చరిత్రలో IEEPAని ఎక్కువగా ఆంక్షలు విధించడానికి, విదేశీ ఆస్తులను ఫ్రీజ్ చేయడానికి, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను నియంత్రించడానికి మాత్రమే వాడారు. ఇది సంప్రదాయ సుంకాల సాధనంగా రూపకల్పన కాలేదు. అయితే ట్రంప్ పాలన ఈ విధానాలకు తూట్లు పొడిచి సుంకాలపై ప్రయోగించింది.
IEEPAను సాధారణంగా అమెరికా ట్రెజరీ శాఖ, ముఖ్యంగా దాని విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం నిర్వహిస్తుంది. దీన్ని సెక్షన్ 122, 232, 301 వంటి ఇతర వాణిజ్య చట్టాలతో పోల్చితే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. సెక్షన్ 301 అన్యాయమైన వాణిజ్య పద్ధతులపై ప్రతీకారం కోసం, సెక్షన్ 232 జాతీయ భద్రతకు ముప్పు కలిగించే దిగుమతులపై చర్యల కోసం రూపొందించబడ్డాయి. ఈ రెండింటికీ ముందస్తు దర్యాప్తు అవసరం. కానీ IEEPA అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక నియంత్రణ కోసం మాత్రమే ఉద్దేశించబడింది. కాని ట్రంప్ ప్రపంచ దేశాలపై దీన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగానికి ఎట్టకేలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది.
అయితే ఈ తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ట్రంప్ మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122ను ఉపయోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని వాణిజ్య భాగస్వాములపై 10 శాతం సుంకం విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. ఈ సెక్షన్ ప్రకారం అమెరికాకు పెద్ద, తీవ్రమైన చెల్లింపుల బ్యాలెన్స్ లోటు ఉన్నప్పుడు, గరిష్టంగా 150 రోజుల పాటు 15 శాతం వరకు తాత్కాలిక దిగుమతి సర్‌ఛార్జ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా తాత్కాలిక చర్య మాత్రమే. దీన్ని కొనసాగించాలంటే కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ట్రంప్ సుంకాల బాదుడుతో ఆయన అనుకున్న లక్ష్యం మాత్రం నేరవేరలేదని చెప్పవచ్చు. అమెరికాకు ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య లోటు గణనీయంగా తగ్గినప్పటికీ.. స్థానిక తయారీ రంగం మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగాల ప్రభావం ఇంక దారుణంగానే ఉంది. ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. పన్నులు ప్రభావం ప్రధాన రంగాలను కుదిపేస్తున్నాయి.
దీనికి తోడు ఈ పన్నుల భారంతో అమెరికా సామాన్య ప్రజలు భారీగానే నష్టపోతున్నారు. వారి జేబులకే చిల్లుల పడుతున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకాయి. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. చాలా మంది ప్రజలు ఈ సుంకాల వల్ల తమ జీవనం భారమైందని బాధపడుతున్నట్లుగా నివేదికలు కూడా వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలను అమెరికా సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేయడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
More From GoodReturns

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications