అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధమంటలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనపడటం లేదు. ఈ యుధ్దం మూడు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలను రేపుతోంది. ముఖ్యంగా చమురు సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేయడంతో చమురు షిప్పులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చమురు, LPG సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ప్రపంచానికి ఓ కఠిన హెచ్చరిక జారీ చేసింది. హార్ముజ్ జలసంధి గుండా ఒక్క లీటరు చమురు కూడా వెళ్ళనివ్వబోమని బెదిరింపులకు దిగింది.
ఇక ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరవచ్చని కూడా హెచ్చరించింది. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతపై మరింత ఆందోళనను పెంచింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) కీలక నిర్ణయం తీసుకుంది. IEAలో సభ్యత్వం ఉన్న 32 దేశాలు కలిసి అత్యవసర చర్యగా 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి ఏకగ్రీవంగా అంగీకరించాయి. హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచ మార్కెట్లో ఏర్పడే సరఫరా కొరతను తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యం.

IEA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చమురు మార్కెట్ ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా సవాలుతో కూడుకున్నవని చెప్పారు. ప్రపంచ మార్కెట్లు పరస్పరంగా అనుసంధానమై ఉన్నందున పెద్ద సంక్షోభాలకు కూడా ప్రపంచ స్థాయిలోనే సమిష్టి చర్య అవసరమని ఆయన పేర్కొన్నారు. సభ్య దేశాలు కలిసి అత్యవసర చర్యకు ముందుకు రావడం ఇంధన భద్రత పట్ల వారి ఐక్యతను సూచిస్తుందని ఆయన అన్నారు.
IEA (The International Energy Agency) అనేది ప్రపంచ ఇంధన మార్కెట్‌ను పర్యవేక్షించే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ. 1973లో జరిగిన గ్లోబల్ ఆయిల్ సంక్షోభం తరువాత చమురు సరఫరా, డేటా సమన్వయం కోసం 1974లో ఈ సంస్థ స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉంది. OECD ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ సంస్థ ప్రపంచ ఇంధన పరిస్థితులపై నివేదికలు విడుదల చేస్తూ ప్రభుత్వాలకు విధాన సలహాలు అందిస్తుంది.
ప్రస్తుతం IEA సభ్య దేశాలు కలిపి సుమారు 1.2 బిలియన్ బ్యారెళ్ల పబ్లిక్ ఎమర్జెన్సీ చమురు నిల్వలు కలిగి ఉన్నాయి. అదనంగా పరిశ్రమల బాధ్యతలో ఉన్న నిల్వలుగా సుమారు 600 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉంది. ఇలాంటి అత్యవసర చర్యల్లో భాగంగా చమురు విడుదల చేయండి ఇదే మొదటిసారి కాదు. గతంలో 1991, 2005, 2011, 2022లో రెండుసార్లు కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారు.
ఇటీవల ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం కారణంగా హార్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతం నుంచి ముడి చమురు, శుద్ధి చేసిన చమురు ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుతం యుద్ధానికి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే 10 శాతం కంటే తక్కువకు పడిపోయాయి.
ప్రపంచ చమురు రవాణాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలక మార్గం. 2025లో సగటున రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తులు ఈ మార్గం ద్వారా రవాణా అయ్యాయి. ఇది ప్రపంచ సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు వాణిజ్యంలో దాదాపు 25 శాతం వాటాను సూచిస్తుంది. అందుకే ఈ మార్గం మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్‌పై భారీ ప్రభావాన్ని చూపుతోంది.
క్లుప్తంగా చూసినట్లయితే హార్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు IEA తీసుకున్న 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదల నిర్ణయం గ్లోబల్ మార్కెట్‌ను స్థిరపరచడానికి కీలక చర్యగా భావిస్తున్నారు.
More From GoodReturns

LPG గ్యాస్ సంక్షోభం.. PNG గ్యాస్ కనెక్షన్ ఎలా పొందాలి.. ఆన్లైన్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications