Multibagger Stock: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బ్యాంకింగ్ మల్టీబ్యాగర్ స్టాక్..
Multibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా కంపెనీలు ఇటీవల తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ స్టాక్ సైతం మెరుస్తూ తన పెట్టుబడిదారులకు కనకవర్షం కురిపిస్తోంది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది IDFC First బ్యాంక్ స్టాక్ గురించే. వరుసగా ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ పెరుగుతూ కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. మంగళవారం బీఎస్ఈలో రూ.71.85 రేటును తాకిన స్టాక్ నేడు సైతం ఈ రేటుకు సమీపంలోనే ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో దీర్ఘకాలంలో పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ రాబడులను పొందారు.

IDFC ఫస్ట్ బ్యాంక్ ఇటీవల తన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో బ్యాంకింగ్ కంపెనీ నికర లాభం ఏకంగా 134 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.343 కోట్లుగా ఉన్న నికర లాభం తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.803 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో నికర వడ్డీ ఆదాయం 35 శాతం పెరిగి రూ.3,597 కోట్లకు చేరుకుంది. అలాగే నిర్వహణ లాభం ఏడాది ప్రాతిపదికన 61 శాతం పెరిగి రూ. 1,342 కోట్లకు చేరుకుంది.
ఇదే క్రమంలో ఈ బ్యాంక్ స్టాక్ పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు మంచి రాబడిని పొందారు. గత సంవత్సరంలో స్టాక్ ధర దాదాపు 97 శాతం పెరిగింది. దీంతో రిటైలర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అలాగే మూడేళ్ల కాలంలో కంపెనీ ఇన్వెస్టర్లకు 220 శాతం మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్ కంపెనీలు మంచి పనితీరును కనబరచటంతో అనేక మంది ఈ స్టాక్ ను నిశితంగా పరిశీలిస్తున్నారు.
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటి IDFC ఫస్ట్ బ్యాంక్. ఇది తన వినియోగదారులకు అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. IDFC బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల విలీనం ద్వారా 2018లో IDFC ఫస్ట్ బ్యాంక్ ఏర్పడింది. ఇది రిటైల్, కార్పొరేట్ కస్టమర్ల అవసరాలను తీరుస్తోంది.


Click it and Unblock the Notifications