Education loan: పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి ఆర్థిక స్తోమత సహకరించక, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునేవారు. ఇదంతా గతం అయితే ఇప్పుడు కనీసం LKG, UKG ఫీజులు సైతం భయపెట్టే స్థాయిలో ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థల ఫీజులు వింటే తల్లిదండ్రులు హడలిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్కూల్ విద్యార్థులకు సైతం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ అవసరాన్ని తీర్చడానికి IDFC ఫస్ట్ బ్యాంకు ముందుకొచ్చింది. స్కూల్ ఫీజు కోసం ఫైనాన్స్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. బయట అధిక వడ్డీకి అప్పులు చేసి పిల్లలను చదివించుకునే పేరెంట్స్ కు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు. స్కూల్ ఫీజు ఫైనాన్స్ కింద 9 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు తెలిపింది. సులభంగా రీపేమెంట్స్ చేయడం కోసం EMI ఆప్షన్ సైతం అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

ఈ రుణాన్ని రెండేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ లోన్ తీసుకోవడానికి అర్హులు. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల కోసం రుణం తీసుకోవచ్చు. కానీ బ్యాంకుతో భాగస్వామ్యం ఉన్న పాఠశాలల్లో చదువుతున్నట్లయితే మాత్రమే ఈ లోన్ మంజూరు చేయబడుతుందని గుర్తించుకోవాలి. అంటే పాఠశాలలో చేరే ముందు దానికి బ్యాంకుతో పార్టనర్షిప్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
స్కూల్ ఎడ్యుకేషన్ లోన్ పొందాలంటే అవసరమైన డాక్యుమెంట్స్ తో IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్ ని సందర్శించాలి. తద్వారా దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదేకాక 50 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి సైతం సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.


Click it and Unblock the Notifications