IDFC First Bank: దేశంలోని ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ అయిన ప్రైవేట్ సెక్టార్ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో వి.వైద్యనాథన్ పేరు వార్తల్లో సంచనంగా మారింది. ఎప్పుడో పొందిన సాయానికి కోట్ల రెట్లు తిరిగి చెల్లించటం వార్తల్లో సంచలనంగా మారింది.
వైద్యనాథన్ 5 మందికి సుమారు రూ.5.5 కోట్లు విలువైన 7 లక్షల షేర్లను బహుమతిగా అందించారు. వీరిలో ఒకరివద్ద ఆయన గతంలో రూ.1000 అప్పుగా తీసుకున్నారు. అప్పు ఇచ్చిన వ్యక్తి వింగ్ కమాండర్ సంపత కుమార్.. ప్రస్తుతం పదవీ విరమణ పొందారు. అయితే ఈ సొమ్ము తిరిగి చెల్లించటానికి ముందే వారిద్దరి మధ్య పరిచయం పోయింది. వి వైద్యనాథన్ చాలా కాలం వెతికినా సంపత్ కుమార్ కుటుంబాన్ని కనుగొన్నారు. ఇప్పుడు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ వైద్యనాథన్ సంపత్ కుమార్ చికిత్స కోసం కేవలం రూ.1,000 రుణం తీసుకున్నారు. ప్రస్తుతం దీనిని 2.5 లక్షల షేర్ల రూపంలో తిరిగి చెల్లించారు. దీని ధర దాదాపు రూ.2 కోట్లుగా ఉంది.

షేర్లు బహుమతిగా పొందిన 5 మంది వ్యక్తులపై CEOకి వ్యక్తిగత ఆసక్తి లేదు. వాటాలు ఇచ్చిన మరో ఇద్దరు కనోజియా, మనోజ్ సహాయ్. వైద్యనాథన్ సమీర్ మ్హత్రేకు ఇల్లు కొనుగోలు చేయడంలో సహాయపడటానికి 50,000 షేర్లను, మయాంక్ మృణాల్ ఘోష్‌కు 75,000 ఈక్విటీ షేర్లను 'సహోద్యోగి మృత్యువు కారణంగా కుటుంబానికి ఆర్థిక భద్రత'గా బహుమతిగా ఇచ్చారు.
మార్చి 21న ఐదుగురికి సీఈవో దాదాపు 7 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఇటీవల త్రైమాసికంలో కంపెనీ రూ.715 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 31, 2023 నాటికి IDFC ఫస్ట్ బ్యాంక్ కస్టమర్ డిపాజిట్లు సంవత్సరానికి 42.8% పెరిగి రూ.1,76,481 కోట్లకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications