డ్రైవర్, పనివాళ్లకు రూ.4 కోట్ల షేర్ల బహూకరించిన బ్యాంకు సీఈవో
IDFC ఫస్ట్ బ్యాంకు ఎండీ, సీఈవో వైద్యనాథన్ రూ.3.95 కోట్లకు పైగా విలువైన 9 లక్షల బ్యాంకు షేర్లను తనకు సహాయకులుగా వ్యవహరిస్తున్న అయిదుగురికి బహుమతిగా ఇచ్చారు. ఇందులో తన ట్రైనర్, పనివాళ్లు, డ్రైవర్ ఉన్నారు. వీళ్ళెవరికి కూడా ఈ ప్రయివేటు రంగ బ్యాంకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుతో సంబంధం లేదు. కానీ వారికి పెద్ద ఎత్తున షేర్లను కేటాయించి తన ఉదాహతను చాటుకున్నారు.

వారికి లక్షల షేర్లు
ట్రైనర్ రమేష్ రాజుకు 3 లక్షల షేర్లు, ఇంట్లో పనిలో సాయం చేసే ప్రంజల్ నర్వేకర్‌కు 2 లక్షల షేర్లు, డ్రైవర్ అల్గార్‌సామికి 2 లక్షల షేర్లు, ఆఫీస్ సిబ్బంది దీపక్ పథారేకు 1 లక్ష షేర్లు, ఇంటి పనిలో సాయం చేసే సంతోష్ జోగలేకు 1 లక్ష షేర్లు బహూకరించారు. బీఎస్ఈలో సోమవారం షేర్ ముగింపు ధర రూ.43కు పైన ఉంది. దీని ప్రకారం 9 లక్షల షేర్ల వ్యాల్యూ దాదాపు రూ.4 కోట్లు. 9 లక్షల షేర్లు అంటే ఇది ఆ బ్యాంకులో 3.7 శాతం వాటా.

38 శాతం బహుమతి రూపంలో
ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఈ మొత్తాన్ని వారు ఇంటి కొనుగోలుకు ఉపయోగించుకుంటారు. ఫైలింగ్ ప్రకారం 54 ఏళ్ల వైద్యనాథన్ 2018 జనవరి నుండి మొత్తం 38 శాతం వాటాలను బహుమతి రూపంలో ఇచ్చారు. వైద్యనాథన్ నుండి బహుమతి పొందినవారిలో 2020లో ఓ మాజీ గణిత ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. ఇతను ప్రీమియర్ స్కూల్లో ఉన్నప్పుడు ఇనిస్టిట్యూషన్‌కు వెళ్లడానికి డబ్బులు లేకుంటే, సదరు ఉపాధ్యాయుడు రూ.500 ఇచ్చారు.

సంక్షేమ ట్రస్టులకు కూడా...
మరో 20,000 షేర్లను సంక్షేమ ట్రస్ట్‌లకు ఫండ్స్ కోసం విక్రయించారు. డిసెంబర్ 18, 2018 నుండి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు 5 శాతం మేర లాభపడ్డాయి. 2020 కరోనా పాండమిక్ సమయంలో ఈ స్టాక్ రూ.20 దిగువకు పడిపోయింది. అయితే క్రమంగా కోలుకుంది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.43.85 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications