Ideaforge IPO: ఇటీవల మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలు ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన డ్రోన్ తయారీ వ్యాపారంలో ఉన్న కంపెనీలు మంచి రాబడులను అందిస్తున్నాయి.
తాజాగా మార్కెట్లోకి వచ్చిన డ్రోన్ తయారీ సంస్థ ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీవో మంచి స్పందనను పొందింది. ఈ క్రమంలో మెుత్తం 106.05 సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. 2022 తర్వాత 100 రెట్లకు పైగా ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పొందిన ఏకైన ఐపీవోగా కంపెనీ చరిత్ర సృష్టించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కంపెనీ ఐపీవోపై భారీగా పందెం వేస్తున్నారు.

ఐపీవోలో పెట్టుబడి పెట్టిన వారి వివరాలను గమనిస్తే ప్రధానంగా అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్ కనిపించింది. వారికి ఎలాట్ చేసిన కోటా 125.81 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఆ తర్వాత రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 85.16 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 80.58 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. దీంతో కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్లో సైతం భారీ ప్రీమియం పలుకుతోంది.
IdeaForge టెక్నాలజీ IPOకి గ్రే మార్కెట్‌లోనూ బలమైన స్పందన లభించింది. ప్రస్తుతం గ్రే మార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కొక్కటి రూ.550 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. ఐపీవో కోసం ఒక్కో షేరు ధర ప్రైస్ బ్యాండ్ రూ. 638-672గా కంపెనీ నిర్ణయించింది.

ఇన్వెస్టర్లకు కంపెనీ షేర్లు రూ.672 ఎగువ ధర వద్ద కేటాయించబడి.. గ్రే మార్కెట్ ప్రీమియం రూ.550 వద్ద షేర్లు లిస్టింగ్ కి అడుగుపెడితే ఒక్కో షేరు రూ.1222 వద్ద ఎక్స్ఛేంజీల్లో అడుగుపెడతాయి. అంటే పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్ పై లిస్టింగ్ రోజున 80% కంటే ఎక్కువ లాభం పొందవచ్చు. షేర్ల కేటాయింపు జూలై 5న జరగనుండగా.. వాటి లిస్టింగ్ జూలై 10న జరగనుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.567 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications