IdeaForge IPO: డ్రోన్ మేకర్ ఐడియాఫోర్జ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీవో షేర్ నేడు మార్కెట్లో లిస్ట్ అయ్యింది. భారీ ప్రీమియం ధరకు లిస్ట్ అయిన స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది.
ఎన్ఎస్ఈలో స్టాక్ రూ.1,300 రేటుకు జాబితా అయ్యింది. ఇది దాదాపు ఇష్యూ ధర కంటే 93.5 శాతం ఎక్కువ ధర. ఇదే క్రమంలో స్టాక్ బీఎస్ఈలో రూ.1,305.10 వద్ద లిస్టైంది. కంపెనీ షేర్లను ఎగువ బ్యాండ్ ధర రూ.672 వద్ద ఇన్వెస్టర్లకు అలాట్ చేసింది. దీంతో ఇన్వెస్టర్లు సంపదను ఒక్కసారిగా డబుల్ చేసి ఆశ్చర్యపరిచింది.

ఉదయం 11.30 గంటల సమయంలో బ్రోన్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.1,296 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభించిన సమయం నుంచి ఒక్కో షేరుపై 92.77 శాతం పెరిగి రూ.621 లాభాన్ని అందించింది. ఈ క్రమంలో ఇంట్రాడేలో స్టాక్ గరిష్ఠంగా రూ.1,343.95 స్థాయిని తాకింది. చాలా మంది ఇన్వెస్టర్లు భారీ లాభాలను తీసుకునేందుకు ఇష్టపడటంతో ప్రాఫిట్ బుక్కింగ్ చేసుకుంటున్నారు. స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్‌లో ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ మిశ్రా సైతం ఇన్వెస్టర్లకు ఇదే సలహా ఇచ్చారు.
IdeaForgeకి కొన్ని వ్యాపార సంబంధిత రిస్క్‌లు ఉన్నాయని మిశ్రా అభిప్రాయపడ్డారు. కాబట్టి లాభాలను ముందుకు తీసుకువెళ్లే రిస్క్ తీసుకోకుండా ఇప్పుడే వాటిని లాక్ చేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో రిస్క్ తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లు రూ.1,170 స్టాప్ లాస్‌తో పెట్టుబడిని కొనసాగించాలన్నారు.
More From GoodReturns

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications