ఐడీబీఐ సీఈవో వేతనం రూ.2 లక్షల నుండి రూ.20 లక్షలకు!

ప్రయివేటురంగ దిగ్గజం ఐడీబీఐ బ్యాంకు తమ ఎండీ, సీఈవో రాకేష్ శర్మ వేతనాన్ని పదిరెట్లు చేయాలని ప్రతిపాదించింది. దీని అమలు కోసం ఓ సాధారణ తీర్మానాన్ని పాస్ చేయడానికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల అనుమతిని కోరింది. ఈ నెల 6వ తేదీన మొదలైన ఈ ప్రక్రియ వచ్చే నెల 5వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రెండు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాన్ని బ్యాంకు వెల్లడిస్తుంది. శర్మ ప్రస్తుతం నెలకు రూ.2.64 లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు. దీనిని రూ.20 లక్షలకు పెంచాలని భావిస్తున్నారు.

ఈ బ్యాంకు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా షేర్ హోల్డర్ల అనుమతి తీసుకొని, మే 7వ తేదీన ఫలితాలను ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 24, 2022న ఆర్బీఐ ఆమోదం అనంతరం ఐడీబీఐ బ్యాంకు మార్చి 19, 2022న మూడు సంవత్సరాల కాలానికి శర్మను మరోసారి అపాయింటుమెంట్‌ను ఆమోదించింది. బ్యాంకు సభ్యుల ఆమోదానికి లోబడి ఇది జరిగింది.

IDBI Bank seeks approval from shareholders for a 10 fold hike in MD, CEO salary

కాగా, శర్మ వేతనం పెంపును కోరడం వెనుక కారణాన్ని వెల్లడిస్తూ రాకేష్ బ్యాంకును పీసీఏ నుండి బయటకు తీసుకు రావడంతో పాటు తన పదవీ కాలంలో బ్యాంకు పనితీరును మెరుగుపరిచినట్లు పేర్కొన్నారు. అతను బ్యాంకులో పరివర్తనాత్మక మార్పులు తీసుకు వచ్చారని బ్యాంకు ప్రమోటర్లు, వాటాదారులు అతనిపై విశ్వాసం చూపించారని బ్యాంకు పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+