IDBI Bank: ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు ఇటీవల ఊహించినదాని కంటే మంచి పనితీరును కనబరిచాయి. ప్రైవేటు బ్యాంకులకు తామేమీ తక్కువ కాదన్నట్లుగా మంచి పనితీరును కనబరుస్తూ ముందుకు సాగుతున్నాయి.
ఏప్రిల్ 29, 2023న విడుదలైన మార్చి త్రైమాసిక ఫలితాల్లో ఐడిబిఐ బ్యాంక్ ఊహించని ఫలితాలను నమోదు చేసింది. బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభంలో 64.1 శాతం పెరిగి రూ.1,133 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.691 కోట్లుగా ఉంది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.3,279.6 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ.2,420.5 కోట్లుగా ఉంది. అంటే గత ఏడాదితో పోల్చితే ఆదాయం 35.3 శాతం పెరిగింది. ఇదే సమయంలో బ్యాంక్ క్యాపిటల్ అడిక్విటీ రేషియో మెరుగుపడి 20.44 శాతానికి చేరుకుంది. త్రైమాసిక ప్రాతిపధికన ప్రొవిజన్లు వరుసగా 26 శాతం పెరిగి రూ.983.63 కోట్లకు చేరుకున్నాయి.
ఇదే సమయంలో బ్యాంక్ నిరర్థక ఆస్తులు మెరుగుపడ్డాయి. డిసెంబర్ మాసంలో 13.82 శాతంగా ఉన్న ఎన్‌పీఏలు 6.38 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏ త్రైమాసికం క్రితం 1.08 శాతం నుంచి 0.92 శాతానికి పడిపోయింది. రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేరుపై బ్యాంక్ రూపాయి డివిడెండ్ చెల్లించాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం ఎన్ఎస్ఈలో ఐడిబిఐ బ్యాంక్ షేర్ ధర రూ.54.55 వద్ద ముగిశాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications