ICRA: దేశంలో భారీగా పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య..
భారత విమానయాన పరిశ్రమ కొత్త శిఖరాలను చేరుకోనుంది. విమానాల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. విదేశాలకు వెళ్లేవారే కాదు.. స్వదేశంలో కూడా ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. ఇందుకు సంబంధించి ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఇక్రా (ICRA) లిమిటెడ్ నివేదిక విడుదల చేసింది. మార్చి 2024 నాటికి దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 129 లక్షల నుండి 135 లక్షలకు చేరుకుందని నివేదిక వివరించింది. ఇది 4.9 శాతం వృద్ధిని సూచిస్తుందని పేర్కొంది.
2019-20లో 14.2 కోట్ల మంది డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించారు. ఫిబ్రవరిలో 1.26 కోట్ల మంది ప్రయాణించారు. మార్చి 2024లో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 6.9 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. అలాగే విమానయాన సంస్థల నష్టాలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
దేశీయ విమానయాన పరిశ్రమకు 2022-23లో నికరంగా రూ.17,000కోట్లు-రూ.17,500 కోట్ల నష్టం వాటిల్లింది.

ఇంది 2023-24, 2024-25లలో రూ.3,000 కోట్లు-రూ.4,000 కోట్లకు పరిమితం కావొచ్చని ఇక్రా అంచనా వేసింది. ఫిబ్రవరితో ముగిసిన 2023-24 తొలి 11 నెలల్లో దేశీయ విమాన సంస్థల్లో ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ 2.7 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే సమయంతో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. "FY2024లో గో ఎయిర్‌లైన్స్ (ఇండియా) లిమిటెడ్ P&W ఇంజన్‌ల లోపం కారణంగా దాని విమానాల్లో సగభాగాన్ని నిలిపివేసింది.ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) కూడా ప్రాట్ & విట్నీ కారణంగా 70 కంటే ఎక్కువ విమానాలను నిలిపివేసింది." నివేదిక పేర్కొంది.
అయినప్పటికీ ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు నివేదిక వివరించింది. కొన్ని విమానయాన సంస్థలు తగినంత లిక్విడిటీ లేదా బలమైన పేరెంట్ నుంచి ఆర్థిక సహాయాన్ని పొందుతున్నాయని తెలిపింది. వారి క్రెడిట్ ప్రొఫైల్‌లకు మద్దతు ఇస్తుండగా ఇతరుల క్రెడిట్ మెట్రిక్‌లు, లిక్విడిటీ ప్రొఫైల్ సమీప కాలంలో ఒత్తిడిలో ఉంటాయని ఇక్రా తెలిపింది.


Click it and Unblock the Notifications