Bank Deposits: భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల కిందట ఇదే వ్యవహారంపై భారతీయ రిజర్వు బ్యాంక్ సైతం తన హెచ్చరికను ప్రకటించింది. ఇది చూస్తుంటే భారతీయ బ్యాంకులకు ప్రజలు దూరమౌతున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం మార్కెట్లో పెద్ద చర్చకుదారితీస్తోంది. చాలా మంది స్టాక్ మార్కెట్లు, ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి అధిక రాబడులవైపు డబ్బును మళ్లిచటం ఈ పరిస్థితులకు దారితీసినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బ్యాంకుల్లో డిపాజిట్ల సంఖ్య తగ్గిపోతోంది. అలాగే బ్యాంకుల్లో డబ్బు జమ చేసే వేగం కూడా మందగిస్తోంది. ఈ వేగాన్ని పెంచేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ దేశంలోని బ్యాంకులకు అందించింది. ఇది సదరు బ్యాంకుల వ్యాపారాన్ని సజావుగా నడిపేందుకు ఇబ్బందులు కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన భారతీయ బ్యాంకులు ఈ లోటును పూడ్చేందుకు నిధుల సమీకరణకు వెళుతున్నాయి. ప్రత్యామ్నాయంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్లను జారీ చేయడం ద్వారా బ్యాంకులు రూ.1.3 లక్షల కోట్ల వరకు సమీకరించవలసి వస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA నివేదించింది.

ICRA నివేదిక ప్రకారం దేశీయ బ్యాంకులు బాండ్ల జారీ మార్గంలో దాదాపు రూ.1.2 నుంచి రూ.1.3 లక్షల కోట్లను సమీకరిస్తాయని తెలుస్తోంది. వాస్తవానికి ఇదే ఇప్పటి వరకు అత్యధికం కావటం గమనార్హం. పాజిట్లు, క్రెడిట్ వృద్ధి మధ్య నిరంతర అంతరం ఉన్న సమయంలో బ్యాంకింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి. దాదాపు 85 శాతం బాండ్లను ప్రభుత్వ రంగ బ్యాంకులే జారీ చేయనున్నాయని నివేదిక పేర్కొంది. దీనికి ముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో బాండ్లను జారీ చేయడం ద్వారా బ్యాంకులు రూ.లక్ష కోట్లు సమీకరించాయి. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.1 లక్షల కోట్లు సేకరించాయి.
క్రెడిట్ వృద్ధి స్థిరంగా డిపాజిట్ వృద్ధిని మించిపోవడం వల్ల బ్యాంకులు ప్రత్యామ్నాయ వనరుల నుంచి నిధులను సేకరించాల్సిన అవసరం ఉందని రేటింగ్ ఏజెన్సీ ICRA పేర్కొంది. బాండ్ల నుంచి నిధులను సేకరించడం వలన ప్రైవేట్ రంగ బ్యాంకులకు రుణ రహిత నిష్పత్తి మరింత దిగజారిపోతుందని ఇక్రా ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్ హెడ్ సచిన్ సచ్‌దేవా పేర్కొన్నారు. అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న విస్తారమైన పరిధిని బట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల ద్వారా వృద్ధి చెందుతూనే ఉంటాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 30, 2024 నాటికి మౌలిక సదుపాయాల రంగానికి బ్యాంకుల అడ్వాన్స్ క్రెడిట్ రూ.13-14 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications