RCF Share: ఆర్సీఎఫ్ టార్గెట్ ప్రైస్ రూ.117..! నివేదిక విడుదల చేసిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్..
దేశీయ బ్రోకరేజ్, పరిశోధనా సంస్థ ICICI సెక్యూరిటీ ఓ PSU స్టాక్ పై డిటైల్డ్ రిసెర్చ్ రిపోర్ట్ విడదల చేసింది. PSU ఎరువులలో రాష్ట్రీయ కెమికల్ & ఫెర్టిలైజర్ (RCF)పై నిర్మాణాత్మకంగా ఉందని పేర్కొంది. ఎందుకంటే ఎరువుల స్టాక్ గత కొద్ది సంవత్సరాల పడిపోతున్నా సరఫరా లైన్ కంటే ఎక్కువ బ్రేక్‌అవుట్‌ను సృష్టించిందని తెలిపింది.

రూ.117
"ఈ షేరు గత 18 నెలల శ్రేణి (రూ.104-66) కంటే ఎక్కువ బ్రేక్‌అవుట్‌ను ఉత్పత్తి చేసే దశలో ఉందని వివరించింది. తద్వారా కొత్త ప్రవేశ అవకాశాన్ని అందిస్తోందని.. ఇటీవలి కన్సాలిడేషన్ ఆధారంగా 20 నెలల EMA వద్ద ఉందని తెలిపింది. దాదాపు మూడు నెలల కాలపరిమితితో రూ.117 స్థాయిల (టార్గెట్ ధర) వైపు వెళ్తుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది.

ప్రభుత్వ వాటా 75 శాతం
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) ప్రముఖ ఎరువులు, రసాయనాల తయారీ సంస్థగా ఉంది. దీనిలో భారత ప్రభుత్వం 75% వాటా కలిగి ఉంది. సంస్థ 1997లో 'మినీరత్న' హోదాను పొందింది. దీనికి రెండు ఆపరేటింగ్ యూనిట్లు ఉన్నాయి. ఒకటి ముంబైలోని ట్రాంబేలో, మరొకటి రాయ్‌గఢ్ జిల్లా వద్ద ఉంది.

ప్రస్తుతం రూ.102.80
RCF యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, బయో-ఎరువులు, సూక్ష్మ పోషకాలు, నీటిలో కరిగే ఎరువులు, మట్టి కండీషనర్లు మరియు అనేక రకాల పారిశ్రామిక రసాయనాలను తయారు చేస్తుంది. బుధవారం నాటికి ఆర్సీఎఫ్ షేరు ధర రూ.102.80 వద్ద. కాగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ దీనికి టార్గెట్ ప్రైస్ రూ.117 గా అంచనా వేస్తోంది.
note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిలు రిస్క్ తో కూడకున్నవి.


Click it and Unblock the Notifications