Mutual Funds: లక్షాధికారులను కోటీశ్వరులు చేసిన మ్యూచువల్ ఫండ్.. మీరూ తెలుసుకోండి..
Mutual Funds: డబ్బును సురక్షితంగా పెట్టుబడుల్లో ఉంచేందుకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక ఉత్తమమైన మార్గం. అందుకే ఈ రోజుల్లో దీనిని చాలా మంది మధ్య తరహా ఆదాయం కలిగిన వారు సైతం సేవింగ్స్ కోసం ఎంచుకుంటున్నారు. పైగా ఇన్వెస్టర్ రిస్క్ కు అనుగుణంగా చాలా రకాల స్కీమ్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి.

లక్షలు కోట్లు చేసిన స్కీమ్..
ICICI ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ ప్రారంభమై ఇటీవల 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. స్కీమ్ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్(AUM) ప్రస్తుతం రూ.14,227 కోట్లుగా ఉంది. 31 అక్టోబర్ 2002న ఈ స్కీమ్ లో ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే ప్రస్తుతం దాని విలువ రూ.4.6 కోట్లకు చేరుకుంది. అంటే ఈ కాలంలో పెట్టుబడిదారులు ఏకంగా 21.2 శాతం చొప్పున కాంపౌండ్ రిటర్న్ పొందారు. ఇదే మెుత్తాన్ని నిఫ్టీ 50లో పెట్టుబడిగా ఉంచితే.. దాని విలువ రూ.2.50 కోట్లుగా ఉండేది.

SIP రిటర్న్స్..
ICICI ప్రుడెన్షియల్ మల్టీ అసెట్‌లో నెలవారీ రూ.10,000 SIP చేసినట్లయితే.. ఆ మొత్తం విలువ ప్రస్తుతం రూ.1.8 కోట్లకు పెరిగి ఉండేది. అయితే ఈ కాలంలో వారి అసలు పెట్టుబడి కేవలం రూ. 24.1 లక్షలు మాత్రమే. దీని ఆధారంగా ఎస్ఐపీ ఇన్వెస్టర్లకు స్కీమ్ 17.4 శాతం CAGR రేటుతో రాబడిని ఇచ్చింది.

నిపుణులు మాటేంటి..?
ఈ స్కీమ్ ఎసట్ ఎలాకేషన్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని ICICI ప్రుడెన్షియల్ MD & CEO నిమేష్ షా అన్నారు. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు మెరుగైన సంపదను సృష్టించుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఫండ్ నిర్వాహకులు మంచి పని చేశారు. ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి సాధనాలు ఈ ఫండ్‌లో ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శంకరన్ నరేన్ తెలిపారు.పెట్టుబడి విషయానికి వస్తే.. ఏ సమయంలోనైనా ఏ స్కీమ్ మెరుగ్గా పనిచేస్తుందో ఎవరూ ఊహించలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

స్కీమ్ అంటే ఏమిటి?
ICICI ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ స్కీమ్ అనేది బహుళ రంగాల్లో పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఈ స్కీమ్ రాబడి 5 సంవత్సరాల్లో 12.83 శాతం CAGR అయితే 3 సంవత్సరాల్లో 19.80 శాతం CAGRగా ఉంది. ఏక కాలంలో పెట్టుబడులు పెట్టి వాటిని దీర్ఘకాలం హోల్డ్ చేస్తే లక్షాధికారులు కోటీశ్వరులుగా మారవచ్చని ఈ స్కీమ్ రుజువు చేసింది.