కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడా లాడిస్తోంది. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. వేలాది మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో అందరు అప్రమత్తం అవుతున్నారు. అయితే దురదృష్ట వశాత్తు ఈ వరుస బారిన పడితే ఎలా? ఊహించుకుంటేనే ఒకింత భయం కలుగుతోంది కాదు. ఒకవేళ ఆసుపత్రిలో చేరితే పరిస్థితి ఏమిటి? వైద్య ఖర్చుల మాటేమిటి? అన్న వాటిపై అనేక సందేహాలు కలుగుతున్నాయి.

బీమా తీసుకుంటే.య.
ఈ నేపథ్యంలో బీమా తీసుకున్న వారికీ కరోనా వైరస్ సోకితే వర్తింపజేయాలన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసిఐసిఐ లాంబార్డ్, స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్సు కంపెనీలు కోవిడ్-19 బారిన పడిన వారికి బీమా ప్రయోజనం కల్పించే పాలసీలను విడుదల చేశాయి.

ఐసీఐసీఐ లాంబార్డ్
* ఈ బీమా కంపెనీ *కోవిడ్-19 ప్రొటెక్షన్ కవర్' పేరుతో పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
* ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలతో సంబంధం లేకుండా బీమా తీసుకున్న మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది.
* ప్రభుత్వం ఆథరైజ్ చేసిన కేంద్రాలు నిర్వహించే టెస్టుల్లో కోవిడ్-19 పాజిటివ్ అని తేలితే ఆ పాలసీ దారుకు సమ్ ఇన్స్యూర్డ్ మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది.
* పాలసీ కాలానికి ఇది వర్తిస్తుంది. పాలసీ తీసుకున్న తర్వాత వెయిటింగ్ పీరియడ్ 14 రోజులు ఉంటుంది.
* ప్రీమియం రూ. 149 చెల్లిస్తే రూ. 25,000 లకు బీమా రక్షణ లభిస్తుంది. ఈ ప్లాన్ లో పలు వేల్యూ యాడెడ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి. . హెల్త్ అష్యురెన్సు, చాట్ బాట్ ద్వారా వర్చువల్ అసిస్టెన్స్, అంబులెన్సు అసిస్టెన్స్ , టెలి కన్సల్టేషన్ వంటివి ఉన్నాయి.
* 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకు వయసున్న వాళ్ళు ఈ పాలసీని తీసుకోవచ్చు.
* ఈ పాలసీ కాలపరిమితిని ఏడాదికి పరిమితం చేశారు.
* 2019 డిసెంబర్ 31 తర్వాత విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి ఈ పాలసి ద్వారా కవరేజీ ని అందించరు.
* భారతీయులకు మాత్రమే బీమా కవరేజీని ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

స్టార్ హెల్త్ ...
* ఈ కంపెనీ 'స్టార్ నొవెల్ కరోనా వైరస్' పేరుతో పాలసీని తీసుకువచ్చింది.
* 18 నుంచి 65 ఏళ్ల వయసున్న వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.
* ప్రభుత్వ అక్రిడేటెడ్ టెస్ట్ లో పాజిటివ్ అని తేలినా, ఆస్పత్రిలో చేరినా ఏక మొత్తంగా బీమా కవరేజీ మొత్తాన్ని చెల్లించనున్నట్టు కంపెనీ తెలిపింది.
* రూ.459తో పాటు జీఎస్టీ చెల్లిస్తే రూ.21,000, రూ.918 ప్రీమియం తో పాటు జీఎస్టీ చెల్లిస్తే రూ.42,000 సమ్ అష్యురెన్సు లభిస్తుంది.
* 65 ఏళ్ల వరకు వయసున్న వాళ్ళు ఆన్ లైన్ లేదా కంపెనీ ఏజెంట్ల ద్వారా పాలసీని కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications