For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Rates: పసిడి ప్రియులపై బంగారం బాంబు..! త్వరలోనే రూ.62 వేలకు చేరుకోనున్న గోల్డ్..

|

Gold Rates: గత కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరగటం మెుదలయ్యింది. గోల్డ్ అనూహ్యంగా పైపైకి పెరగటానికి అనేక అంతర్జాతీయ కారణాలు ప్రధానంగా దోహదపడుతున్నాయి. దీనికి తోడు మాంద్యం తగ్గకపోవటం ఇన్వెస్టర్లను సేఫ్ హెవెన్ వైపు నడిపిస్తోంది. ఇలాంటి క్రమంలో బాంబు లాంటి వార్త ఒకటి పసిడి ప్రియుల గుండెలను పిండేస్తోంది.

బంగారం ధరలు..

బంగారం ధరలు..

కొత్త సంవత్సరం మెుదటి రోజు బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రజల్లో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. చాలా మంది తొలిరోజు షాపింగ్ లో బంగారం, వెండి కొనటాన్ని శుభప్రదంగా భావిస్తుంటారు. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 10 గ్రాములు రూ.55,200 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600గా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.74,300గా ఉంది.

పెరుగనున్న డిమాండ్..

పెరుగనున్న డిమాండ్..

2023లో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితికి తోడు మాంద్యం భయాలు దీనికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. మార్కెట్లు చాలా ఓలటైల్ గా మారిన వేళ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి విలువను పెంచుకునేందుకు బంగారాన్ని ఎంచుకుంటుంటారు. ఇది దశాబ్ధాలుగా కొనసాగుతున్న అలవాటు.

ఫెడ్ నిర్ణయాలతో బూమ్..

ఫెడ్ నిర్ణయాలతో బూమ్..

ఈ ఏడాది ప్రారంభంలో కీలక వడ్డీ రేట్ల పెంపును యూఎస్ ఫెడ్ నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి తోడు Q4 2023లో కూడా రేట్లను తగ్గించే అవకాశం ఉన్నందున డాలర్‌లో బలహీనత నేపథ్యంలో బంగారం ధరలు ప్రధానంగా పెరిగే అవకాశం ఉంది. రక్షణ కోసం బంగారాన్ని ఎంచుకోవటం వల్ల ఇలా జరుగుతుందని ICICI డైరెక్ట్ రీసెర్చ్ తన కమోడిటీ ఔట్‌లుక్- 2023 నివేదికలో పేర్కొంది.

బంగారం @ 62,000..

బంగారం @ 62,000..

ద్రవ్యోల్బణం కారణంగా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచటంతో బంగారం ధరలు ఏడాది కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. అయితే కరోనా కేసులు భారీగా పెరగటం, ద్రవ్యోల్బణం తగ్గకపోవటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రం కావటం, తైవాన్ పై చైనా దూకుడు పెంచటంతో పాటు యూరోపియన్ దేశాల ఆర్థిక పరిస్థితి దిగజారటం బంగారానికి డిమాండ్ ను పెంచుతోంది. దీనికి తోడు మరిన్ని కారణాల వల్ల 2023లో బంగారం 10 గ్రాముల ధర రూ.62,000 మార్కును చేరుకుంటుందని ఐసీఐసీఐ వెల్లడించింది.

Read more about: gold silver investment business news
English summary

Gold Rates: పసిడి ప్రియులపై బంగారం బాంబు..! త్వరలోనే రూ.62 వేలకు చేరుకోనున్న గోల్డ్.. | ICICI direct research expects gold 10gms reaches 62000 in 2023 amid global uncertinity

ICICI direct research expects gold 10gms reaches 62000 in 2023 amid global uncertinity
Story first published: Sunday, January 1, 2023, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X