Axis Bank: ఇటీవలి కాలంలో యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీ పతనాన్ని చూశాయి. అందుకు బల్క్ డీల్స్ కారణంగా నిలిచాయి. అయితే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ స్టాక్ పనితీరుపై చాలా సానుకూలంగా ఉంది. రానున్న కాలంలో షేర్ హోల్డర్లకు స్టాక్ మంచి రాబడులను అందిస్తుందని తెలిపింది.

అసలు ఏమైంది..
కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ లో తన వాటాల విక్రయం ద్వారా నిష్క్రమించాలని యోచిస్తుండటంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. అలా బ్యాంకులోని 1.55 శాతం వాటాను అంటే 4.65 కోట్ల షేర్లను విక్రయించాలని ప్రభుత్వం చూస్తోందని సమాచారం. అంతకు ముందు విదేశీ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ తన వాటాలను విక్రయించటం జరిగింది.

ICICI డైరెక్ట్ అంచనా..
ఐసీఐసీఐ డైరెక్ట్ మాత్రం యాక్సిస్ బ్యాంక్ షేర్లు రానున్న కాలంలో ఇన్వెస్టర్లను ధనవంతులను చేయగలవని అంచనా వేసింది. అందుకే స్టాక్ టార్గెట్ ధరను రూ.1000గా నిర్ణయించింది. అంటే.. యాక్సిస్ బ్యాంక్ షేర్ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూ.150 వరకు లాభం వస్తుంది. శుక్రవారం మార్కెట్ ముగింపు నాటికి షేర్ స్వల్పంగా లాభపడి రూ.851.95 వద్ద క్లోజ్ అయింది. దీనికి ముందు అక్టోబర్ 27న స్టాక్ తన 52 వారాల గరిష్ఠ ధర అయిన రూ.919.95 స్థాయిని తాకింది.

నిపుణుల మాట..
ICICI డైరెక్ట్ రీసెర్చ్ విశ్లేషకులు కాజల్ గాంధీ, విశాల్ నార్నోలియా, ప్రవీణ్ ములే స్టాక్ పై బులిష్ గా ఉన్నారు. వీరు స్టాక్ టార్గెట్ ధరను రూ.1000 గా నిర్ణయిస్తూ BUY రేటింగ్ ఇచ్చారు. దీర్ఘకాలిక పెట్టుబడి కోణంలో ఈ ప్రైవేట్ బ్యాంక్ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను తెచ్చిపెట్టగలదని ఈ ముగ్గురు అంటున్నారు. మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ కేమా సైతం రానున్న ఏడాది కాలంలో ఈ స్టాక్ 14-20 శాతం వరకు రాబడులను ఇవ్వగలదని అభిప్రాయపడ్డారు.

బ్యాంక్ హిస్టరీ తెలుసా..?
ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ పాత పేరు UTI బ్యాంక్. దీనిని 1993లో ప్రారంభించారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్రైవేటు రంగ బ్యాంక్ కింద సుమారు 86,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీకి సబ్సిడరీ కంపెనీలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.26 లక్షల కోట్లుగా ఉంది.
NOTE: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీని ఆధారంగా ఎలాంటి పెట్టుబడులు చేయకండి. స్టాక్ మార్కెట్లు ఒడిదొడుగులు, నష్టాలతో కూడుకున్నవి. కాబట్టి ఆర్థిక సలహాదారులను సంప్రదించి పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవటం సూచనీయం.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications