Muhurat Trading: మామూలు రోజుల్లో ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు జరిగే ట్రేడింగ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే దీపావళి సాయంత్రం కేవలం గంట పాటు కొనసాగే స్పెషల్ ట్రేడింగ్ గురించి మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది స్టాక్ మార్కెట్లో ఆనవాయితీగా వస్తోంది. ఎక్కువ మంది దీపావళి నాడు లాభాలతో తమ ట్రేడింగ్ ప్రరంభించాలని కోరుకుంటుంటారు.

స్వల్ప సమయంలో..
కేవలం కొన్ని నిమిషాల పాటు జరిగే ఈ ట్రేడింగ్ సమయంలో అసలు ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవాలి. వేటిని కొనుగోలు చేస్తే మంచి లాభం వస్తుంది వంటి విషయాలపై ఇప్పటికే చాలా మంది ఆలోచన చేస్తుంటారు. అలాంటి వారికోసం ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ టాప్ ఎంపికల లిస్ట్ వెల్లడించింది. ఇన్వెస్టర్లకు 10 అత్యుత్తమ షేర్లను కొనుగోలు చేసుకునేందుకు రికమెండ్ చేసింది.

ఐసీఐసీఐ ప్రకారం..
దీర్ఘకాలంలో పెట్టుబడులు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తాయని బ్రోకరేజ్ సూచిస్తోంది. ఐసీఐసీఐ మెుదటగా అత్యుత్తమ వృద్ధితో దూసుకుపోతున్న బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ స్టాక్ ఇందుకోసం ఎంపిక చేసుకుంది. సిటీ బ్యాంక్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవటం దీని వ్యాపార విస్తరణకు ఎంతగానో తోడ్పడుతుందని బ్రోకరేజ్ అభిప్రాయపడింది. ఈ షేరుకు రూ.970 టార్గెట్ ధరగా నిర్ణయించింది.

సిటీ యూనియన్ బ్యాంక్..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్ విషయంలో రూ.215 టార్గెట్ ధరగా కొనుగోలు చేయాలని సూచించింది. దీనితర్వాత అపోలో టైర్స్ స్టాక్ రూ.335 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఆ తర్వాత ఐషర్ మోటార్స్ స్టాక్ కు రూ.4,170 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని సూచించింది. ఆ తర్వాత టాప్ 5 పెట్టుబడి స్టాక్ గా కొఫోర్జీని ఎంపిక చేస్తూ రూ.4,375ను టార్గెట్ ధరగా ఐసీఐసీ వెల్లడించింది.

టాప్-10 స్టాక్స్ విషయంలో..
బ్రోకరేజ్ రికమెండ్ చేసిన స్టాక్స్ లిస్ట్ లో లెమన్ ట్రీ హోటల్స్ కూడా ఉంది. దీని టార్గెట్ రేటుగా రూ.110 ఇవ్వటం జరిగింది. హెల్త్ కేర్ గ్రోబల్ షేర్లకు రూ.345 టార్గెట్ రేటుగా నిర్ణయిస్తూ కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ సూచించింది. ఇక మరో స్టాక్ లారస్ ల్యాబ్స్ విషయంలో రూ.675 టార్గెట్ ధరగా సూచిస్తూ కొనుగోలు చేయాలని రికమెండ్ చేస్తోంది.
ఇక షిప్పింగ్ రంగంలోని కంటైనర్ కార్పొరేషన్ విషయంలో రూ.890 టార్గెట్ ధరగా కంపెనీ కొనుగోలు రేటింగ్ అందించింది. చివరిగా ఎలక్ట్రిక్ ఉపకరణాల తయారీ సంస్థ హావెల్స్ ఇండియా షేర్లకు రూ.1,650 టార్గెట్ ధరగా నిర్ణయిస్తూ కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
Note: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటి ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. నిపుణుల సలహాల మేరకు మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications