ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ICICI బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1, 2026 నుండి తమ క్రెడిట్ కార్డ్ (ICICI credit card) నిబంధనలలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పుల వల్ల ఇప్పటివరకు వినియోగదారులు పొందుతున్న ఉచిత ప్రయోజనాలు తగ్గిపోవడమే కాకుండా.. కొన్ని రకాల లావాదేవీలపై అదనపు ఛార్జీలు పడనున్నాయి. మీరు గనుక ఐసీఐసీఐ కార్డ్ వాడుతుంటే ఈ మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.

ఉచిత మూవీ టికెట్లకు స్వస్తి!
సినిమా ప్రియులకు ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఇప్పటివరకు 'BookMyShow' ద్వారా లభిస్తున్న ఉచిత మూవీ టికెట్ ప్రయోజనాన్ని కొన్ని కార్డులపై బ్యాంక్ రద్దు చేసింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ (ICICI credit card) లోని ఇన్‌స్టంట్ ప్లాటినం చిప్ , ఇన్‌స్టంట్ ప్లాటినం కార్డ్ వాడుతున్న వారికి ఇకపై ఉచిత టికెట్లు లభించవు. అయితే ప్రీమియం కార్డులు వాడుతున్న వారికి కొన్ని పరిమితులతో ఈ సదుపాయం కొనసాగే అవకాశం ఉంది.
రివార్డ్ పాయింట్లపై పరిమితులు
రవాణా (Transport) , బీమా (Insurance) చెల్లింపులపై వచ్చే రివార్డ్ పాయింట్ల విషయంలో కూడా బ్యాంక్ కొత్త పరిమితులు విధించింది.
- రూబీక్స్ (Rubyx) , సఫిరో (Sapphiro) వంటి కార్డులపై నెలకు రూ. 20,000 వరకు చేసే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులపైనే రివార్డ్ పాయింట్లు వస్తాయి.
- ప్లాటినం, కోరల్ , ఎక్స్‌ప్రెషన్స్ కార్డులపై ఈ పరిమితి నెలకు రూ. 10,000 గా ఉంది.
- ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల విషయానికి వస్తే, హెచ్‌పిసిఎల్ (HPCL) సూపర్ సేవర్ కార్డుపై రూ. 40,000 వరకు చేసే ఖర్చుపై మాత్రమే పాత రేటు ప్రకారం రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
కొత్త ఛార్జీల బాదుడు
కేవలం ఆఫర్ల కోత మాత్రమే కాకుండా కొన్ని లావాదేవీలపై కొత్త ఛార్జీలు కూడా ఇకపై అమలు చేయనుంది.
- ఆన్‌లైన్ గేమింగ్: డ్రీమ్ 11, MPL వంటి గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో చేసే పేమెంట్స్ పై 2 శాతం అదనపు ఫీజు వసూలు చేస్తారు.
- వాలెట్ లోడింగ్: పేటీఎం, అమెజాన్ పే లేదా మోబిక్విక్ వంటి థర్డ్ పార్టీ వాలెట్లలో రూ. 5,000 కంటే ఎక్కువ లోడ్ చేస్తే 1 శాతం ఛార్జీ పడుతుంది.
- రవాణా ఖర్చులు: ఒకవేళ రవాణా సంబంధిత ఖర్చులు నెలకు రూ. 50,000 దాటితే ఆ పైన చేసే లావాదేవీలపై 1 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. క్రెడిట్ కార్డ్ మార్కెట్లో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ ICICI క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లను , బ్యాంక్ పంపే నోటిఫికేషన్లను జాగ్రత్తగా గమనించి.. అనవసరపు ఛార్జీలు పడకుండా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఫిబ్రవరి 1 నుండి చేసే ప్రతి పేమెంట్ పై ఒక కన్నేసి ఉంచండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications