Banking Stocks: గడచిన 6 నెలల్లో ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల షేర్లు భారీగా వృద్ధి చెందాయి. ఇలాంటి తరుణంలో బ్రోకరేజ్ హౌస్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మాత్రం రానున్న రోజుల్లో మూడు బ్యాంకులు మంచి రాబడులను అందిస్తాయని అంచనా వేసింది. ఆ కంపెనీల షేర్లు గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటాయని చెబుతోంది. అసలు ఆ స్టాక్స్ ఎంత వరకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ..
ఐసీఐసీఐ అంచనాల ప్రకారం లాభపడే ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి వరుసలో ఉంది. అయితే గత శుక్రవారం మార్కెట్ క్రాష్ వల్ స్టాక్ 3.42 శాతం క్షీణించింది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.573.10 వద్ద ఉంది. గడచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో బ్యాంక్ షేర్లు 5.29 శాతానికి పైగా క్షీణించాయి. అయితే 6 నెలల కిందట కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి 24.26 శాతం రాబడి వచ్చింది. రానున్న రోజుల్లో స్టాక్ ధర రూ.750 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ హౌస్ నమ్మకంగా ఉంది. అందుకే ఎస్బీఐ షేర్లకు BUY రేటింగ్ ఇచ్చింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా..
బ్యాంక్ ఆఫ్ బరోడా పొజిషనల్ షేర్ హోల్డర్లు గత 6 నెలల్లో 69.25 శాతం వరకు రాబడిని అందుకున్నారు. ఈ స్టాక్ గత నెల కూడా మంచి పనితీరును కనబరిచి 0.83 శాతం లాభపడింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు గత 5 ట్రేడింగ్ సెషన్లలో 7.11 శాతం క్షీణించి రూ.169.25 వద్ద ఉన్నాయి. ICICI సెక్యూరిటీస్ అంచనా ప్రకారం రానున్న కాలంలో షేర్ ధర రూ.220 స్థాయికి పెరగవచ్చని తెలుస్తోంది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుకు కూడా బ్రోకరేజ్ BUY రేటింగ్ ఇచ్చింది.

ఇండియన్ బ్యాంక్..
గత 5 సెషన్లలో ఇండియన్ బ్యాంక్ షేర్ ధర 5.79 శాతం పడిపోయి రూ.278.15 స్థాయికి చేరుకుంది. అయితే గత నెల మాత్రం కంపెనీ షేర్లు దాదాపుగా 2.28 శాతం లాభపడ్డాయి. ఎవరైనా ఇన్వెస్టర్ 6 నెలల కిందట ఇన్వెస్ట్ చేసిన వారికి దాదాపు 80 శాతానికి పైగా రాబడి వచ్చింది. ఇండియన్ బ్యాంక్ షేర్లు రాబోయే నెలల్లో రూ.335 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ హౌస్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. అందుకే ఈ కంపెనీ షేర్లకు కూడా BUY రేటింగ్ ఇచ్చింది.
Note: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడుల విషయంలో విచక్షణతో మెలగటం ముఖ్యం. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా దానికి ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం. పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దాని ఆధారంగా ఎలాంటి ఇన్వెస్ట్ మెంట్స్ చేయకండి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications