దేశంలోని రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిందట. కరోనా మహమ్మారి సమయంలో పని చేసిన ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని నిర్ణయించిందని వార్తలు వచ్చాయి. ఈ వైరస్ సమయంలో పని చేసిన వారిలో బ్యాంకుకు చెందిన 80 శాతం మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి వేతనాలు పెంచనున్నారు.

ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు శాలరీ పెంపు
కరోనా సమయంలో వారి ప్రత్యేక సేవలను గుర్తించి శాలరీ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి గాను 8 శాతం వరకు పెంపు ఉంటుందని తెలుస్తోంది. ఇది జూలై నెల నుండి వర్తిస్తుంది. ఈ ఉద్యోగులు ఎం1, అంతకంటే తక్కువ గ్రేడ్‌కు చెందినవారు ఉన్నారు. వీరిలో ఎక్కువగా కస్టమర్ ఫేసింగ్ రోల్స్‌లోని ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఉంది. వీరు బ్యాంకు బ్రాంచీల నిర్వహణ, కార్యకలాపాలలో ఉంటారు. అంటే బ్యాంకు శాఖల్లో రోజు పని చేసేవారు. అయితే దీనిపై బ్యాంకు స్పందించాల్సి ఉంది.

80,000 మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడింది. దీంతో వివిధ రంగాల్లో.. ఎన్నో సంస్థల్లో వేతనాల పెంపును నిలిపివేశారు. కొన్ని సంస్థల్లో వేతనాల్లో కోత విధించారు. ఇలాంటి సమయంలో ఐసీఐసీఐ తమ బ్యాంకు ప్రంట్‌లైన్ ఉద్యోగులకు ఎనిమిది శాతం పెంచాలని నిర్ణయించింది. దాదాపు 80,000 మంది ఉద్యోగులు ఉంటారని తెలుస్తోంది.

మార్చి క్వార్టర్‌లో ఐసీఐసీఐ జూమ్
మార్చి క్వార్టర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు నెట్ ఎర్నింగ్స్ 26 శాతం పెరిగి రూ.1,221 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా, ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్స్ బోర్డు బుధవారం సమావేశమై ఈక్విటీ షేర్ లేదా ఈక్విటీ లింక్డ్ సెక్యూరిటీస్ ద్వారా ఫండ్ రెయిజింగ్ అంశాన్ని పరిశీలిస్తుంది.


Click it and Unblock the Notifications