FDపై వడ్డీ రేట్లు తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంకు

ప్రయివేటురంగ ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను తగ్గించింది. ఎంపిక చేసిన కాలపరిమితులపై దీనిని తగ్గించింది. 91 రోజుల నుంచి 184 రోజుల కాలపరిమితిపై 3.50 శాతం వడ్డీ వస్తుంది. ఐసీఐసీఐ 7 రోజుల నుండి పదేళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తోంది. FDపై గరిష్టంగా 5.50 శాతం వడ్డీని ఇస్తోంది. ఇప్పుడు కొన్ని కాలపరిమితులపై వడ్డీ రేట్లు సమీక్షించింది. ఈ వడ్డీ రేట్లు సోమవారం (సెప్టెంబర్ 7) నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు ఆగస్ట్ 10వ తేదీన బ్యాంకు FD వడ్డీ రేట్లను తగ్గించింది.

7 రోజుల నుండి 29 రోజుల కాలపరిమితిపై 2.5 శాతం వడ్డీ రేటు, 30 రోజుల నుండి 90 రోజులకు 3 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఇప్పుడు 91 రోజుల నుండి 184 రోజుల మధ్య వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనికి 3.5 శాతం అందించనుంది. 185 రోజుల కాలపరిమితి నుండి 289 రోజులకు 4.40 శాతం అందిస్తోంది.

ICICI Bank revises fixed deposit interest rates

290 రోజుల నుండి ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు 4.4 శాతం ఆఫర్ చేస్తోంది. ఏడాది నుండి 18 నెలల కాలపరిమితిపై 5 శాతం వడ్డీ రేటును, 18 నెలల నుండి 2 ఏళ్ల కలపరిమితిపై 5.10 శాతం వడ్డీ రేటును, 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల కాలపరిమితిపై 5.15 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. తాజా సవరణ అనంతరం 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటును 5.50 శాతం అందిస్తుంది.

ఇక సీనియర్ సిటిజన్స్ కోసం ఐసీఐసీఐ బ్యాంకు ప్రత్యేక FD పథకానికి ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్‌ను తెచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ కింద వడ్డీ సాధారణ FD కంటే 0.80 శాతం ఎక్కువ వస్తుంది. 5 ఏళ్ల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందులో రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+