ICICI Bank: దంచికొట్టిన ఐసీఐసీఐ లాభాలు.. మెరుగుపడిన అసెట్ క్వాలిటీ..

ICICI Bank Results: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ ఆస్తుల నాణ్యత పెరుగినట్లు కంపెనీ ప్రకటించింది.

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ లాభంలో 35.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయంలో 24 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మొండి బకాయిలు గణనీయంగా తగ్గాయని బ్యాంక్ తన ఫలితాల్లో నివేదించింది.

ICICI Bank released good q2 numbers, asset quality improved

ముంబైకి చెందిన బ్యాంక్ స్టాండలోన్ లాభం ఈ త్రైమాసికంలో రూ.10,261 కోట్లకు ఎగబాకింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.7,557.84 కోట్ల నుంచి లాభం పెరిగిందని బ్యాంక్ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. క్యూ2లో నికర లాభం రూ.10,261 కోట్లుగా నమోదైంది. వాస్తవానికి విశ్లేషకులు నికర లాభం రూ.9,422 కోట్లుగా అంచనా వేశారు. నికర దేశీయ రుణాలు ఏడాది ప్రాతిపదికన 19.3% వృద్ధి చెందగా, డిపాజిట్లు 18.8% పెరిగాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంక్యూ2లో 22 శాతం పెరిగి రూ.18,080 కోట్లకు చేరుకోవచ్చని బ్రోకరేజీలు అంచనా వేశాయి. లోన్-లాస్ ప్రొవిజన్లు 6 శాతం తగ్గి రూ.1,550 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+