UPI News: UPI సేవలపై ICICI బ్యాంక్ కీలక అప్‌డేట్.. ఇకపై ఆ మొబైల్ నంబర్స్‌తోనూ పేమెంట్స్
ICICI Bank News: ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, మందగమన పరిస్థితులు నెలకొన్నా బలమైన వృద్ధి రేటుతో భారత్ దూసుకుపోతోంది. ఇందులో దేశీయ పేమెంట్స్ ఎకోసిస్టమ్ కీలకంగా వ్యవహరిస్తోంది అనడంలో అతిశయెక్తి లేదు. స్థానికంగా అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇప్పుడు హద్దులు దాటి హవా కొనసాగిస్తోంది.
UPI సేవలు గతంలో కేవలం భారత్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. క్రమేపి ఇతర దేశాలకు సైతం విస్తరించాయి. కాగా ICICI బ్యాంక్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించి భారతదేశంలోనే చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పిస్తోంది. వాటితో UPI కోసం సైన్ అప్ చేయడానికి NRI కస్టమర్‌లను అనుమతిస్తోంది.

అంటే ఇకపై ICICI బ్యాంక్ NRI కస్టమర్‌లు UPI-ఆధారిత బిల్లు చెల్లింపులు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లావాదేవీలు జరపవచ్చు. ఇందుకోసం భారతదేశంలోని వారి NRE/NRO బ్యాంక్ ఖాతాలతో నమోదు చేసుకున్న అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించవచ్చు. USA, UK, UAE, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా సహా 10 దేశాల్లో ఈ ఫీచర్‌ని ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి పని చేస్తోంది.
'ఈ సదుపాయాన్ని వినియోగించడం ప్రారంభించిన NRI కస్టమర్‌ల నుంచి సానుకూల స్పందనను చూస్తున్నాము. ఈ చొరవతో మేము UPI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రభావం చూపాలనుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నాము' అని ICICI బ్యాంక్ డిజిటల్ ఛానెల్స్ మరియు భాగస్వామ్యాల అధిపతి సిధరత మిశ్రా తెలిపారు.


Click it and Unblock the Notifications