RuPay Credit Card: రూపే క్రెడిట్ కార్డులను ప్రారంభించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ICICI బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా తన కస్టమర్లకు మంచి ప్రయోజనాలను అందుబాటులోకి తెస్తోంది.
కోరల్ వేరియంట్‌లో..
వివిధ చెల్లింపు అవసరాల కోసం ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చని ఐసీఐసీఐ వెల్లడించింది. బ్యాంక్ అందిస్తున్న జెమ్‌స్టోన్ సిరీస్‌లోని కోరల్ వేరియంట్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. దీని తర్వాత త్వరలో రూబిక్స్, సప్ఫిరో వేరియంట్‌లు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ వెల్లడించింది.

బహుమతులు..
ICICI బ్యాంక్‌తో భాగస్వామ్యం ఈ కార్డ్ వినియోగదారులకు సౌకర్యంతో పాటు బహుమతులు, ఆనందకరమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని NPCI సీఓఓ ప్రవీణా రాయ్ వెల్లడించారు. ఐసీఐసీఐ కస్టమర్లకు బ్యాంక్ అంధించే ప్రయోజనాలు కార్డులో మిళితమై ఉంటాయని క్రెడిట్ కార్డ్స్, పేమెంట్ సొల్యూషన్స్ అండ్ మర్చంట్ ఎకోసిస్టమ్ హెడ్ సుదీప్తా రాయ్ తెలిపారు. RuPay ప్రత్యేక ఆఫర్‌లతో కూడిన క్రెడిట్ కార్డ్‌లు, కస్టమర్‌లకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తాయని తెలిపారు.

రివార్డ్ పాయింట్స్ ఇలా..
ICICI బ్యాంక్ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కార్డ్ ద్వారా చేసే చెల్లింపులు లేదా ఖర్చుపై ప్రతి రూ.100లకు.. 2 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఫ్యూయల్ చెల్లింపులకు ఇవి వర్తించదని బ్యాంక్ వెల్లడించింది. అయితే.. ఇంధన లావాదేవీలపై ఇంధన సర్‌చార్జి మినహాయింపు ఉంటుందని తెలిపింది. దీనికి తోడు.. యుటిలిటీస్ అండ్ ఇన్సూరెన్స్ కేటగిరీలపై ఖర్చు చేసే ప్రతి రూ.100పై 1 రివార్డ్ పాయింట్ అందిస్తున్నట్లు పేర్కొంది.

ప్రయాణికులకు కాంప్లిమెంట్రీస్..
ఒక సంవత్సరంలో కార్డ్‌పై రూ.2 లక్షలు ఖర్చు చేస్తే కస్టమర్లకు 2000 బోనస్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. అదనంగా రూ. లక్ష ఖర్చు చేసిన ప్రతిసారీ.. 1,000 బోనస్ రివార్డ్ పాయింట్లు పొందవచ్చని బ్యాంక్ వెల్లడించింది. అయితే సంవత్సరానికి గరిష్ఠంగా 10,000 రివార్డ్ పాయింట్లు పొందవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో కార్డ్ హోల్డర్లు దేశీయ విమానాశ్రయ లాంజ్ లతో పాటు ఎంపిక చేసిన రైల్వే లాంజ్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది.

రూ.2 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్..
BookMyShowలో సినిమా టిక్కెట్ బుకింగ్‌లపై తగ్గింపులను కార్డ్ అందిస్తుందని ఐసీఐసీఐ వెల్లడించింది. ఈ కార్డ్ హోల్డర్లకు రూ.2 లక్షల వ్యక్తిగత యాక్సిడెంటర్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ క్యూలినరీ ట్రీట్స్ ప్రోగ్రామ్ ద్వారా డైనింగ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సేవలు నిరంతరాయంగా 24×7 అందుబాటులో ఉంటాయని బ్యాంక్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications